మరో వివాదంలో ప్రభుదేవా | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ప్రభుదేవా

Published Sat, Feb 8 2014 11:05 AM

మరో వివాదంలో ప్రభుదేవా - Sakshi

 ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు ప్రభుదేవా సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంటున్నారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును పొందారు ప్రభుదేవా. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన రాంబో రాజ్‌కుమార్ టైటిల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చివరికి రాంబో రాజ్‌కుమార్ ఆర్.రాజ్‌కుమార్‌గా పేరు మార్చుకుంది. తాజా గా తెరకెక్కిస్తున్న యాక్షన్ జాక్సన్ టైటిల్ వివాదాల్లో చిక్కుకుంది.

ఈ చిత్రంలో అజ య్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరుుతే ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేటెంట్ అని దాన్ని బాలీవుడ్ చిత్రానికి ఉపయోగించరాదంటూ ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రభుదేవాకు, ఆ చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.
 
  యాక్షన్ జాక్సన్ పేరును వాడరాదని, లేకుంటే తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుదేవా చిత్ర నిర్మాతలు తాము యాక్షన్ జాక్సన్ టైటిల్‌ను ముంబాయిలోని నిర్మాతల మండలిలోనూ, నిర్మాతల గిల్డ్‌లోను నమోదు చేశామని, ఈ టైటిల్‌పై ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్‌కు వివరిస్తూ బదులు పంపినట్లు చెప్పా రు. అరుుతే ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement