అమ్మకు మాటలు చెప్పిన ప్రకాశ్‌రాజ్‌ | Sakshi
Sakshi News home page

అమ్మకు మాటలు చెప్పిన ప్రకాశ్‌రాజ్‌

Published Thu, Apr 13 2017 11:25 PM

అమ్మకు మాటలు చెప్పిన ప్రకాశ్‌రాజ్‌

ఐదు పదుల వయసులోనూ వన్నె తరగని అందంతో అభిమానులను అలరిస్తున్నారు అతిలోక సుందరి శ్రీదేవి. వయస్సు పెరిగేకొద్దీ ఆమెలో అందం పెరుగుతోంది. ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన శ్రీదేవి ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మామ్‌’. రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో వైవిధ్యంగా, అందర్నీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌ రూపొందింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరకర్త. అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్‌ అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనయ్‌ గోస్వామి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement