‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’కు పాటలే పెద్ద ఎస్సెట్ | Sakshi
Sakshi News home page

‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’కు పాటలే పెద్ద ఎస్సెట్

Published Wed, Dec 4 2013 1:00 AM

‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’కు  పాటలే పెద్ద ఎస్సెట్

 ‘‘కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రానికి పాటలు పెద్ద ఎస్సెట్. ప్రత్యేకంగా ఈ ఆల్బమ్‌లోని ‘సమ్మతమే..’ పాటంటే నాకు చాలా ఇష్టం’’ అని ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ పాటలను శేఖర్ కమ్ముల ప్రశంసించారు. హర్షవర్దన్ రానే, వితిక శేరు, విష్ణువర్దన్, రీతూ వర్మ, హరీశ్, శ్రీముఖి ముఖ్య తారలుగా డి.సురేష్‌బాబు సమర్పణలో పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘మేం నిర్మించిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి మంచి విజయాన్నిచ్చారు. 
 
 అదే స్ఫూర్తితో సరికొత్త కథాంశాన్ని ఎంచుకొని ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నిర్మించాం. ఇప్పటికే టాప్ 10 ఆల్బమ్స్‌లో ఈ పాటలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఒక్క ఓవర్సీస్‌లోనే 18 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చెప్పారు. అందరికీ కనెక్టయ్యే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందించామని, ఇదొక కొత్త తరహా ప్రేమకథని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని.
 

Advertisement
Advertisement