కన్ను గీటింది...అవార్డు పట్టింది

27 Apr, 2018 14:27 IST|Sakshi
వైరల్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే‍ పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ప్రస్తుతం ఈ 19ఏళ్ల యవ్వనవతి సంపాదన, పాపులారిటీ  స్టార్‌ హీరో కంటే తక్కువేం కాదు. కేవలం సంపాదన, పేరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలోకి మరో గౌరవం వచ్చి చేరింది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొందరు నటులను వరించని అదృష్టం ప్రియా వారియర్‌ను వరించింది. ఇంతకు ఏంటా అదృష్టం అంటే ప్రియ తన తొలి అవార్డును అందుకుంది.

అందేంటి ప్రియ నటించిన సినిమాలు ఇంతవరకూ ఒక్కటి  కూడా విడుదల కాలేదు మరి అప్పుడే అవార్డు అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా?. మరేంలేదు ప్రియ అందుకున్న అవార్డు సినిమాలకు సంబంధించింది కాదు సోషల్‌ మీడియాకు సంబంధించి అవార్డు. 2018 సంవత్సరానికి గాను ‘వైరల్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రియ సొంతం చేసుకుంది. ఇది తన జీవితంలో తాను అందుకున్న తొలి అవార్డు అని, అందుకు చాలా గర్వంగా ఉందని ప్రియా వారియర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రియా వారియర్‌ నటించిన ‘ఒరు ఆదర్‌ లవ్‌’ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు