పైళ్లైపోయిందోచ్‌..!

1 Dec, 2018 20:07 IST|Sakshi

అభిమానులు, బంధుమిత్రులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆ తరుణం వచ్చేసింది. ప్రేమ పక్షులుగా ఉన్న నికియాంకలు(నిక్‌ జోనాస​ - ప్రియాంక చోప్రా).. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రముఖ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్‌ డిజైన్‌ చేసిన పెళ్లి గౌనులో నూతన వధువు ప్రియాంక చిరుదరహాసంతో.. సిగ్గుల మొగ్గవుతూ వేదిక వద్దకు రాగా.. వరుడు నిక్‌ జోనాస్‌, ప్రియురాలు చేతిని అందుకోగా ఏడేడు జన్మలకు మనం ఒకరికొకరం తోడు జీసస్‌ సాక్షిగా పెళ్లి ఉంగరాలను మార్చుకున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిక్‌ జోనాల్‌ - ప్రియాంకల పెళ్లి తంతు పూర్తయ్యింది. ఇక భారతీయ సంప్రదాయం ప్రకారం మరోసారి సప్తపదితో.. మూడు ముళ్లతో ఈ జంట నూతన బంధంలోకి అడుగు పెడతారు. ఇప్పటి వరకైతే వీరి వివాహా వేడుకకు సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. కానీ ప్రియాంక - నిక్‌ జోనాస్‌ల కోసం పెళ్లి బట్టలు డిజైన్‌ చేసిన రాల్ఫ్‌ లారెన్‌ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం పూర్తయిందంటూ ట్వీట్‌ చేస్తూ అభినందనలు తెలిపారు.

ఇంత అద్భుతమైన సంగీత్‌ను ఎప్పుడూ చూడలేదని ప్రియాంక పెళ్లిని చిత్రీకరించడానికి వెళ్లిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జోసెఫ్‌ రాధిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘నేను పెళ్లి‌ ఫొటోగ్రాఫర్‌గా మారి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంత వరకూ ఎప్పుడూ చూడని అద్భుతమైన సంగీత్‌ను రాత్రి చూశా.. వావ్‌’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల వివాహ వేడుకను కూడా రాధికే షూట్‌ చేశారు.

రాజస్థాన్‌లోని ఉమైద్‌ ప్యాలెస్‌లో నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 3వరకూ పెళ్లి సంబరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ వేడుకలాగే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటకు రాకూడదని కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారట వీరి కుటుంబ సభ్యులు. అందులో భాగంగా ఈ ప్యాలెస్‌ను 29నుంచి 3 వరకూ సందర్శకులు వీక్షించడానికి కూడా వీలు లేకుండా క్లోజ్‌ చేశారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా