బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

3 Apr, 2020 14:49 IST|Sakshi

"అమెరికా నుంచి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు నా తండ్రి అశోక్ చోప్రా నా అవ‌తారం చూసి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అప్పుడు నాకు ప‌ద‌హారేళ్లు. నేను బిగుతైన దుస్తులు ధ‌రించి ఉన్నాను. దీంతో అలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నావేంటంటూ ఒంటికాలిపై లేచారు. అలా మా ఇద్ద‌రికీ చాలా సేపు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది" అంటూ.. త‌న‌ తండ్రితో జ‌రిగిన గొడ‌వ‌ను గుర్తు చేసుకుందీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అయితే ఇలాంటి గొడ‌వ‌లు ఎన్ని జ‌రిగినా తామిద్ద‌రం బెస్ట్‌ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. ఈమేర‌కు ఓ పత్రిక‌తో మాట్లాడుతూ.. "నేను చేసింది త‌ప్పా, ఒప్పా?, మంచా, చెడా? అనేది ప‌క్క‌న‌పెట్టి ఏ విష‌యాన్నైనా స‌రే ముందుగా త‌న‌తో చెప్పాల‌నేవాడు. ప్ర‌తీ స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపిస్తాననేవారు. అంతేకానీ వెంట‌నే త‌ప్పంతా నాదేన‌ని నిందించేవాడు కాదు. అలా ఎప్పుడూ నాతోపాటు, నా జ‌ట్టులో ఉంటాన‌ని మాటిచ్చాడు." అని తెలిపింది. (ఏడడుగులేస్తారా?)

కాగా ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా 2013లో కాలేయ క్యాన్స‌ర్ వ‌ల్ల క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇక‌ ఈ భామ‌ చిన్న‌త‌నంలో విద్య‌ను అభ్య‌సించ‌డానికి అమెరికానే ఎందుకు ఎంచుకుందో చెప్పుకొచ్చింది. అక్క‌డి హైస్కూల్స్‌లో చ‌ద‌వాల‌ని త‌న‌కెప్ప‌టి నుంచో కోరిక‌గా ఉండేద‌ని పేర్కొంది. పైగా అక్క‌డ విద్యార్థుల‌కు యూనిఫామ్ ధ‌రించాల‌నే నియ‌మ నిబంధ‌న‌లు కూడా లేవంది. అంతేకాక ఎంచ‌క్కా అమ్మాయిలు త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా మేక‌ప్‌ మేక‌ప్ వేసుకుని మ‌రీ వెళ్లొచ్చని తెలిపింది. అలా ఎనిమిదో త‌ర‌గ‌తిలోనే ఈ వేషాలన్నీ వేశానంది. కాగా ప్ర‌స్తుతం ఈ భామ త‌న భ‌ర్త నిక్ జొనాస్‌తో క‌లిసి లాస్ ఏంజెలెస్‌లో ఉంటోంది. చుట్ట‌పు చూపుగా అప్పుడ‌ప్పుడు భార‌త్‌కు వ‌స్తూ ఉంటుంది. క‌రోనా ప్ర‌బలుతున్న‌ వేళ ఈ గ్లోబ‌ల్ జంట భార‌త్‌కు త‌న వంతు విరాళాన్ని ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. (రండి కలిసి పోరాడుదాం: ప్రియాంక)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా