ప్రియాంక మనసులో ఏముంది? | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 4:29 PM

Is Priyanka Chopra Signed A Cowboy Ninja Hollywood Movie - Sakshi

ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్‌ స్టార్‌. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిన ప్రియాంక ఇక ఇండియన్‌ సినిమాలు చేయదేమో అన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు సల్మాన్‌ ఖాన్‌ భరత్‌ సినిమా కోసమే ప్రియాంక ఇండియాకు వచ్చారని వార్తలు వచ్చాయి. కానీ భరత్‌ సినిమా నుంచి ప్రియాంక తప్పుకున్నట్లు డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ ప్రకటించారు. 

అయితే ప్రియాంక మనసులో ఏముందో తెలియడం లేదు. తాజాగా మరో హాలీవుడ్‌ మూవీకి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరత్‌ సినిమాను రెమ్యునరేషన్‌ కారణంగానే వదులుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తన ప్రియుడు నిక్‌ జోనస్‌తో వివాహం కారణంగానే ప్రియాంక  సినిమాను వదులుకున్నట్లు ‘భరత్‌’ మూవీ డైరెక్టర్‌ పేర్కొన్నారు. కౌబాయ్‌ నింజా వికింగ్‌ సినిమాలో ప్రధాన పాత్రను ప్రియాంక పోషించనున్నట్లు తెలుస్తోంది. జురాసిక్‌ వరల్డ్‌, గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ సినిమాలతో ఫేమస్‌ అయిన క్రిస్‌ ప్రాట్‌తో ప్రియాంక జతకట్టనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement