కోలీవుడ్‌లో పులిమురుగన్‌ | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో పులిమురుగన్‌

Published Thu, Jan 19 2017 4:52 AM

కోలీవుడ్‌లో  పులిమురుగన్‌

యాక్షన్, ఎడ్వెంచర్‌ కథా చిత్రంగా రూపొందిన మలయాళ చిత్రం పులిమురుగన్‌. అక్కడ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కమలిని ముఖర్జీ కథానాయకిగా నటించారు. నమిత, జగపతిబాబు, లాల్, బాలా, వినూమోహన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనాన్ని ఉదయకృష్ట అందించారు. వైశాఖ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ములకపడం ఫిలింస్‌ పతాకంపై తోమిచన్‌ ములకపడం నిర్మించారు. చిన్న చిత్రాలకు చిరునామా మాలీవుడ్‌ అన్న పేరును తడిపేసి రూ.37 కోట్ల వ్యయంతో రూపొంది రూ.150 కోట్లు వసూలు చేసి మలయాళ చిత్రపరిశ్రమలో ఈ రెండు విషయాల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన తొలి చిత్రం పులిమురుగన్‌.

అంతే కాదు మన్యంపులి పేరుతో తెలుగులోకి అనువాదమై అక్కడ మంచి విజయాన్ని అందుకున్న పులిమురుగన్‌ ఇప్పుడు ఇదే పేరుతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. మలయాళ చిత్ర నిర్మాతనే ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్ర కథేంతంటే తన తండ్రిని తన కళ్ల ముందే చంపిన పులిని ఒక కుర్రాడు ఆ పులిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు.అతను పెద్ద అయిన తరువాత కూడా పులుల నుంచి ఆ గ్రామాన్ని కాపాడడమే వృత్తిగా స్వీకరిస్తాడు. అతను పులులను ఎలా వేటాడతాడన్నదే చిత్ర కథనం అని చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో నాలుగు బీభత్సమైన పోరాట సన్నివేశాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. చిత్ర చివరి ఘట్ట పోరాట దృశ్యాలను స్టంట్‌మాస్టర్‌ పీటర్‌హెయిన్స్‌ నేతృత్వంలో 96 రోజులు చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి గోపిసుందర్‌ సంగీతాన్ని అందించారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement