కశ్మీర్‌లో సల్మాన్‌ రేస్‌ 3 షూటింగ్‌ | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో సల్మాన్‌ రేస్‌ 3 షూటింగ్‌

Published Fri, Apr 20 2018 5:49 PM

Race 3 Team Leading To Jammu Kashmir For Shooting - Sakshi

సాక్షి, ముంబయి : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్‌ ఖాన్‌ మూవీ రేస్‌ 3 షూటింగ్‌​ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మిగిలిన కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం చిత్ర మేకర్లు తెరకెక్కిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌తో పాటు రేస్‌ 3 బృందం త్వరలోనే కశ్మీర్‌లో రెండు, మూడు రోజుల పాటు షూటింగ్‌ జరపనున్నట్టు తెలిసింది. కశ్మీర్‌లో కొన్ని సన్నివేశాలతో పాటు లీ, లడఖ్‌ ప్రాంతాల్లో ఓ పాటను చిత్ర బృందం​చిత్రీకరించనుంది.

సల్మాన్‌ గతంలో నటించిన భజ్‌రంగీ భాయ్‌జాన్‌ మూవీని జమ్మూకాశ్మీర్‌లో చిత్రీకరించారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్‌ 3లో సల్మాన్‌తో పాటు జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ జంటగా నటిస్తుండగా, బాబీ డియోల్‌, సాఖిబ్‌ సలీం, అనిల్‌ కపూర్‌, డైసీ షాలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రేస్‌ 3 మూవీ ఈ ఏడాది జూన్‌ 15న ఈద్‌ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా సల్మాన్‌ ఖాన్‌ భరత్‌ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని అలి అబ్బాస్‌ జఫర్‌ భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2019 ఈద్‌కు విడుదల కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement