అందాలు... సిత్రాలు! | Sakshi
Sakshi News home page

అందాలు... సిత్రాలు!

Published Fri, Oct 16 2015 1:05 AM

అందాలు... సిత్రాలు!

‘సీతమ్మ అందాలూ...’ అంటూ ‘శుభసంకల్పం’ చిత్రంలో కమల్‌హాసన్, ఆమని చేసిన సందడి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పాట గురించి ప్రస్తావించడానికి కారణం ఉంది. రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. పూర్ణిమ ఎస్. బాబు సమర్పణలో ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ అందాలు- రామయ్య సిత్రాలు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సున్నితమైన భావోద్వేగాలతో, మంచి వినోదంతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. రాజ్ తరుణ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అతని కెరీర్‌కి మరో మైలురాయిలా నిలిచే చిత్రం. కథానాయికగా పరిచయమవుతున్న అర్తనకు కూడా మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.

Advertisement

తప్పక చదవండి

Advertisement