యాంకరింగ్‌ కంటే యాక్టింగ్‌ కష్టం | Sakshi
Sakshi News home page

యాంకరింగ్‌ కంటే యాక్టింగ్‌ కష్టం

Published Fri, Jun 2 2017 12:32 AM

యాంకరింగ్‌ కంటే యాక్టింగ్‌ కష్టం

‘‘ఇప్పటివరకు టీవీ షోలకే పరిమితమైన నేను తొలిసారి ‘రాజా మీరు కేక’లో నటించా. శ్వేత పాత్రలో నటనకు మంచి స్కోప్‌ ఉందనిపించి, ఒప్పుకున్నా. యాక్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. దర్శకుడు నాలో నమ్మకాన్ని పెంచి, శ్వేత పాత్రకు ఒప్పించారు’’ అని యాంకర్, నటి లాస్య అన్నారు.

రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లాస్య మాట్లా డుతూ– ‘‘విలన్‌ వల్ల నష్టపోయిన స్నేహితులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నదే ఈ చిత్రకథ. గ్లామర్‌ కంటే పెర్‌ఫార్మెన్స్‌ పాత్రలంటేనే ఇష్టం. యాంకరింగ్‌ కంటే యాక్టింగ్‌ కష్టం’’ అన్నారు.

మ్యారీడ్‌ లైఫ్‌ గురించి చెబుతూ – ‘‘మంజునాథ్‌తో ఆరేడేళ్ల ప్రయాణం తర్వాత పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నా. వివాహం వల్ల టీవీ షోస్‌కు బ్రేక్‌ తీసుకున్నా, ఇప్పుడు సోలో, వైవిధ్యమైన షోలు చేయడానికి సిద్ధమే. మరో చిత్రంలోనూ నటించబోతున్నా’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement