అంతర్జాతీయ స్థాయి చిత్రానికి రాజమౌళి 'సై' | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయి చిత్రానికి రాజమౌళి 'సై'

Published Wed, Nov 20 2013 4:42 PM

అంతర్జాతీయ స్థాయి చిత్రానికి రాజమౌళి 'సై' - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత విజయవంతమైన దర్శకుడిగా అగ్రస్థానంలో ఉన్న రాజమౌళి మరో ఘనత దక్కింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన సినిమా 'సై' ఆయనకు అంతర్జాతీయ స్థాయి అవకాశం తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని ఆయనే ఫేస్బుక్లో వెల్లడించారు.

రగ్బీ క్రీడ ఇతివృత్తంగా రాజమౌళి 'సై' సినిమాను రూపొందించారు. ఈ క్రీడాంశంపై ప్రపంచ వ్యాప్తంగా తెరకెక్కిన మూడు సినిమాల్లో సై ఒకటి. ఈ సినిమా భారత రగ్బీ కోచ్ విల్లీ హటేరకకు తెగనచ్చేసింది. రాజమౌళి ప్రతిభను గుర్తించిన హటేరక ఆయనకు అంతర్జాతీయ స్థాయి అవకాశం ఇప్పించారు. 'సై సినిమా గురించి మీకు ఓ శుభవార్త తెలియజేస్తున్నా. భారత రగ్బీ కోచ్ ఈ చిత్రాన్ని చూసి ఉత్సుకత చెందారు. రగ్బీని 144 దేశాల్లో ఆడుతారు. అంతర్జాతీయ రగ్చీ బోర్డు ఓ ప్రమోషనల్ కార్యక్రమం రూపొందిస్తోంది. హటేరక 'సై' సినిమా గురించి వారికి తెలియజేశారు. అంతేగాక, అంతర్జాతీయ రగ్బీ బోర్డు ఈ క్రీడాంశంపై రూపొందించే చిత్రానికి దర్శకుడిగా నా పేరును ప్రతిపాదించారు' అని రాజమౌళి ఫేస్బుక్లో పేర్కొన్నాడు.

Advertisement
Advertisement