దర్బార్‌: ట్విటర్‌లో ఏమంటున్నారంటే?

9 Jan, 2020 09:49 IST|Sakshi

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్‌ గెటప్‌లో కనిపిస్తుండటంతో థియేటర్‌లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్‌ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్‌’ప్రీమియర్‌ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

రజనీ వన్‌ మ్యాన్‌ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్‌ పాయింట్‌.  సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు ఒక్క సెకన్‌ కూడా బోర్‌ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్‌ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్‌బస్టర్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘జెట్‌ స్పీడ్‌ స్క్రీన్‌ ప్లే, ఒక్క సెకండ్‌ కూడా బోర్‌ కొట్టదు. కామెడీ, రొమాంటిక్‌, యాక్షన్స్‌ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్‌ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్‌ లేదని అర్థం’, ‘తలైవా వన్‌ మ్యాన్‌ షో. రజనీ ఎనర్జీ, స్టైల్‌, చరిష్మా అందరినీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్‌’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌ హిట్‌’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్‌లో కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

సినిమా

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?