గెళెయా.. గెళెయా... | Sakshi
Sakshi News home page

గెళెయా.. గెళెయా...

Published Thu, May 18 2017 11:56 PM

గెళెయా.. గెళెయా...

‘‘మిత్రమా.. ఈ గెలుపు ఎప్పటికైనా మనదే.. ఏమైనా సరే ఇలాగే ఎప్పుడూ కలిసుందాం...’’ అని కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ని మన తెలుగు హీరో ఎన్టీఆర్‌ ఓ రేంజ్‌లో ఎంకరేజ్‌ చేశారు. మాటలతో కాదు.. ఏకంగా పాట రూపంలో పునీత్‌ని ప్రోత్సహించారు. కన్నడంలో స్టార్‌ హీరోగా దూసుకెళుతోన్న పునీత్‌కి ఎందుకు ఎంకరేజ్‌మెంట్‌ కావాల్సి వచ్చింది? ఎన్టీఆర్‌నే ఎందుకు ప్రోత్సహించమని అడిగారనే కదా మీ డౌట్‌. కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’లోని ‘గెళెయా గెళెయా.. గెలువే నమదయ్యా..’ పాట వినే ఉంటారు. గెళెయా అంటే మిత్రమా అని అర్థం. పునీత్‌ నటించిన ఈ సినిమాలో ఈ పాటను ఎన్టీఆర్‌ పాడారు.

‘‘మిత్రమా.. ఈ గెలుపు ఎప్పటికైనా మనదే...’’  అనే అర్థంతో సాగే ఈ పాటను పునీత్‌తో ఉన్న స్నేహం కోసం పాడారు ఎన్టీఆర్‌. పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా బాగా ఆడింది. ఇప్పుడీ పాట కోసం కన్నడ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి గాయకుడి జాబితాలో ఎన్టీఆర్‌ పేరు ఉండటం విశేషం. అఫ్‌కోర్స్‌ తెలుగులో అప్పుడప్పుడూ పాటలు పాడినప్పటికీ కన్నడంలో ఎన్టీఆర్‌ పాడిన తొలి పాట ఇదే కదా. నామినేషన్‌లో ఎన్టీఆర్‌ పేరు ఉన్న విషయం తెలిసిన అభిమానులు ‘గెళెయా..’ పాటను అన్వయిస్తూ ‘గెలుపు మనదే’ అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement