క్యారెక్టర్‌ ముఖ్యం

19 Dec, 2018 01:10 IST|Sakshi

మంచి నటుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు రాజ్‌కుమార్‌ రావు. హీరోగా ఈ ఏడాది ‘స్త్రీ’ చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకున్నారాయన. ఇప్పుడు దీపికా పదుకోన్‌ కోసం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారబోతున్నారట. ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో దీపికా పదుకోన్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావు ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని బాలీవుడ్‌ తాజా సమాచారం.

ఒకవైపు హీరోగా చేస్తున్నప్పటికీ క్యారెక్టర్‌ బాగుంటే చాలు.. నిడివి తక్కువ అయినా వేరే సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలనుకుంటారట రాజ్‌కుమార్‌. ఢిల్లీ యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాతో దీపికా నిర్మాతగా మారనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజ్‌కుమార్‌ నటించిన ‘మెంటల్‌ హై క్యా, మేడ్‌ ఇన్‌ చైనా, ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఏసా లగా’ చిత్రాలు వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు