‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

16 Aug, 2019 22:45 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాఖీ పండగ సెలబ్రేట్‌ చేసుకోవడం.. అందులో పునర్నవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈ ఇంట్లో అతనిలో తమ్ముడిని చూసుకున్నానని చెబుతున్న ప్రోమో విడుదల చేయడం.. రాహుల్‌కు రాఖీ కట్టిందని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవడంతో నేటి ఎపిసోడ్‌ను అందరూ ఆసక్తికరంగా తిలకించారు. అయితే అందరూ ఊహించినట్లు ఆ రాఖీని రాహుల్‌కు కట్టలేదు.. పైగా.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్పా అని చెప్పి కుండబద్దలు కొట్టేసింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సాగిందిలా..

బిగ్‌బాస్‌ మెదడుకు మేత టాస్క్‌ను పెట్టి హౌస్‌మేట్స్‌ తెలివితేటలను పరీక్షించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ రెండు టీమ్స్‌గా విడగొట్టి.. మధ్యలో శివజ్యోతిని టీచర్‌గా పెట్టి క్విజ్‌ పోటీ నిర్వహించాడు. మొదటి రౌండ్‌లో జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా.. రెండో రౌండ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన, మాట్లాడుకున్న సంఘటనలపై ప్రశ్నలను వేశాడు. ఈ ప్రశ్నలకు హౌస్‌మేట్స్‌ దాదాపు అందరూ సరైన జవాబులనే చెప్పుకొచ్చారు. మూడో రౌండ్‌లో అబ్బాయిల టీమ్‌ దూకుడు ప్రదర్శించగా.. చివరకు రెండు టీమ్స్‌కు సేమ్‌ పాయింట్స్‌ వచ్చాయి. దీంతో చివరగా ఓ ప్రశ్నను సంధించగా.. రవికృష్ణ సమాధానం చెప్పడంతో అబ్బాయిల టీమ్‌ విజేతగా నిలిచింది.

అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప
రాహుల్‌కు తప్ప మిగతా వారందరికీ రాఖీ శుభాకాంక్షలు అని పునర్నవి చెప్పడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. దీంతో రాహుల్‌ ఫుల్‌ ఖుషీ అయినట్టు కనపడింది. వరుణ్‌ సందేశ్‌లో తన తమ్ముడిని చూసుకున్నానని చెప్పి పునర్నవి అతనికి రాఖీ కట్టింది.  ఇంట్లోకి వచ్చినప్పుడు మొదటగా అన్న అని పిలిచిందని.. తనకు హిమజ రాఖీ కట్టాలని వరుణ్‌ తెలిపాడు. మహేష్‌.. అషూ రెడ్డితో రాఖీ కట్టించుకోగా, అలీరెజా.. శివజ్యోతితో కట్టించుకున్నాడు. తన ఇంట్లో వారు శివజ్యోతికి బహుమతి కూడా పంపారని అలీ తెలిపాడు. తన తమ్ముడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని శ్రీముఖి చెప్పి.. బాబా భాస్కర్‌చేతుల మీదుగా శ్రీముఖి రాఖీ కట్టించుకుంది. అనంతరం అందరూ స్వీట్లు పంచుకున్నారు. చివరగా బాబా భాస్కర్‌ కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ఏర్పాటు చేశాడు. బాబా భాస్కర్‌ కోసం ఆయన సతీమణి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేసి చూపించాడు. వీకెండ్‌ వచ్చేసింది. ఇంట్లో నుంచి ఒకరు వెళ్లిపోయే తరుణం కూడా వచ్చేసింది. మరి ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్‌నుంచి శివ జ్యోతి, రవికృష్ణ, రాహుల్‌ సిప్లిగంజ్‌, రోహిణి, బాబా భాస్కర్‌, శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌లోంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో చూడాలి. (రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?)

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?