షారుక్ను టార్గెట్‌ చేసిన ఆర్జీవీ! | Sakshi
Sakshi News home page

షారుక్ను టార్గెట్‌ చేసిన ఆర్జీవీ!

Published Mon, Apr 25 2016 3:43 PM

షారుక్ను టార్గెట్‌ చేసిన ఆర్జీవీ!

నిత్యం ఎవరినో ఒకరిని ఉద్దేశించి కామెంట్ చేయడం దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు అలవాటు. నిన్నమొన్నటి చిరంజీవి, రజనీకాంత్‌ వంటి సూపర్‌ స్టార్‌ హీరోలను ఉద్దేశించి ట్విట్టర్‌లో తనదైన వ్యాఖ్యలతో హల్‌చల్‌ చేసిన వర్మ తాజాగా షారుక్  ఖాన్‌పై గురి పెట్టాడు. ఆయన అభిమానిగా సలహాలు ఇస్తున్నానని చెప్తూనే.. 'ఫ్యాన్‌' లాంటి సినిమాలు చేస్తే.. నీ స్టార్‌డమ్‌కు సల్మాన్‌ఖాన్‌కు వెళ్లడం ఖాయమని కింగ్‌ఖాన్‌ను హెచ్చరించాడు ఆర్జీవీ. ఇంతకు వర్మ ఏమన్నాడంటే..

'మెగాస్టార్‌ షారుఖ్‌ రానురాను సాధారణ ఫ్యాన్‌గా, మరుగుజ్జుగా మారిపోతున్నాడు. ఒకప్పుడు కమల్‌ హాసన్‌ ఇలాంటి తప్పులే చేసి తన స్టార్‌డమ్‌ను రజనీకాంత్‌కు అప్పగించాడు. పొట్టిగా, పొడవుగా, లావుగా విచిత్రమైన పాత్రలు చేసేవరకూ కమల్‌ హసన్‌ కూడా రజనీకాంత్‌ లాగా సూపర్‌ స్టార్‌ హీరోనే. అందుకే ఒక అభిమానిగా షారుక్ కు చెప్తున్నా. తప్పుడు సలహాదారుల మాటను వినకండి' అని ' అని ఆర్జీవీ సూచించాడు. తనకు దేవుడి పట్ల నమ్మకం లేదని, కానీ షారుక్‌ కోసం అల్లాకు ప్రార్థిస్తానని చెప్పారు. కమల్‌ హాసన్‌ తప్పుల నుంచి షారుక్ పాఠాలు నేర్చుకోవాలని, మెగా రజనీకాంత్‌ లా కాకుండా తనను అడ్డుకుంటున్న సన్నిహితుల మాటను ఆయన అసలే వినకూడదని సలహా ఇచ్చారు.

షారుక్ ను తాను మెగాస్టార్‌గానే భావిస్తానని, ఆయనకు సల్మాన్‌లాగా కండలు లేకపోయినా, ఆమిర్‌ఖాన్‌లాగా పనితనమూ లేకపోయినా వారిద్దరి కన్నా గొప్ప స్టార్‌గా ఎదిగాడని వర్మ పేర్కొన్నాడు. రజనీ ఎప్పుడూ రజనీలాగే ఉన్నాడని, కానీ కమల్‌ హాసన్‌ మాత్రం తనలాగా తాను ఉండక.. ఇతరుల్లా ఉండేందుకు ప్రయత్నించాడని, అందువల్లే తన స్టార్‌డమ్‌ను రజనీకాంత్‌కు కోల్పోయాడని చెప్పుకొచ్చారు. రజనీకాంత్‌లాగా గొప్ప స్టార్ హీరో అయ్యే అవకాశం షారుక్ ఉందని, ఈ విషయాన్ని గుర్తెరిగి.. తనలాగా తాను ఉండటం ఉత్తమమని సలహా ఇచ్చారు.

Advertisement
Advertisement