సరిగ్గా అదే సమయానికి.. | Sakshi
Sakshi News home page

సరిగ్గా అదే సమయానికి..

Published Thu, Oct 15 2015 8:05 PM

సరిగ్గా అదే సమయానికి.. - Sakshi

వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇప్పటికే ఫ్యాక్షన్ హత్యలు, ముంబై దాడులు వంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్సను తనదైన శైలిలో తెరకెక్కించిన రామూ ఈసారి గడగడలాడించిన గంధపుచెక్కల దొంగ వీరప్పన్ జీవిత కథను ఎంచుకున్న సంగతి తెలిసిందే. 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

అయితే ఇది సాధారణమేగా అనుకుంటే పొరపాటే. సరిగ్గా వీరప్పన్ చంపబడిన సమయానికి 'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 18 వ తేదీ రాత్రి 10.40 నిముషాలకు ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు రామ్ గోపాల్ వర్మ.

 

 

 

Advertisement
Advertisement