ప్రధానిపై రాంగోపాల్ వర్మ పరోక్ష విమర్శలు | Sakshi
Sakshi News home page

ప్రధానిపై రాంగోపాల్ వర్మ పరోక్ష విమర్శలు

Published Tue, Aug 4 2015 5:02 PM

ప్రధానిపై రాంగోపాల్ వర్మ పరోక్ష విమర్శలు - Sakshi

నీలిచిత్రాల సైట్లను నిషేధించడంపై తీవ్రంగా ఆవేదన చెందుతున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఎక్కడా ప్రధానమంత్రి అని గానీ, నరేంద్రమోదీ అని గానే పేరు ప్రస్తావించకుండానే.. ఆయననే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. సోషల్ మీడియానే ఆయనను హీరోగా చేసిందని, తనకు కూడు పెట్టిన సోషల్ మీడియా చేతులను ఆయన తినేశారని అన్నారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన రెండు చేతులనూ తినేయడం ఖాయమని కూడా శాపనార్థాలు పెట్టారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో మోదీ హవా బాగా నడిచిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా యువత, విద్యావంతులు ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా మోదీ అభిమానులుగా మారి ఆయనను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు నీలిచిత్రాల సైట్లను నిషేధించడం ఆ సోషల్ మీడియా ఫాలోవర్లకు ఇబ్బంది అన్నది వర్మ అంతరార్థంలా కనిపిస్తోంది.

 

Advertisement
Advertisement