రాగసుధను పెళ్లాడిన రంజిత్ | Sakshi
Sakshi News home page

రాగసుధను పెళ్లాడిన రంజిత్

Published Wed, Nov 12 2014 11:25 PM

రాగసుధను పెళ్లాడిన రంజిత్ - Sakshi

ప్రముఖ తమిళ నటుడు రంజిత్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కారు. నటి రాగసుధను ఆయన వివాహం చేసుకున్నారు. నవంబర్ 10న చెన్నైలోని తిరువెర్కాడులో వీరి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి వధూవరులు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

వధువు రాగసుధ సీనియర్ నటి కేఆర్ విజయ మేనకోడలు కేఆర్ సావిత్రి కుమార్తె. రంజిత్ ఇంతకుముందు నటి ప్రియారామన్ పెళ్లాడారు. 15 ఏళ్లు కాపురం చేశాక ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. రంజిత్, రాగసుధ వివాహానికి కేఆర్ విజయ, యువరాణి, భానుప్రియ, అర్చన తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement