అందర్నీ టార్చర్‌ పెట్టాను!

7 Jan, 2020 03:35 IST|Sakshi
రష్మికా మందన్నా

‘‘నేను చాలా సెటిల్డ్‌ యాక్టర్‌ని. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్‌ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు.

► దర్శకుడు అనిల్‌గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్‌ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్‌ ఉంది. మహేశ్‌బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్‌ చేయడం బోనస్‌.  

► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్‌గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్‌ యాక్టివ్‌. ఫుల్‌ లెంగ్త్‌ నవ్వించే పాత్ర నాది. ట్రైన్‌ ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్‌ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ  టార్చర్‌ పెట్టాను. సెట్లో అందరూ కామ్‌గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్‌ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్‌ పెట్టకే’ అని అనుకున్నాను.
 
► ఈ  సినిమా ట్రైలర్‌లో కనిపించినంత హైపర్‌గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి,  దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్‌ జత చేసి నటించాను.  

► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్‌ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్‌ అంటారు కదా. అలాగే సీనియర్‌ యాక్టర్‌ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్‌ అయిపోయాను. చాలా పాజిటివ్‌గా ఉంటారు. కేరళలో షూటింగ్‌ అప్పుడు మేం ఫ్రెండ్స్‌ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్‌ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు).  

► ఈ సినిమాలోని ‘మైండ్‌ బ్లాక్‌..’ సాంగ్‌లో డ్యాన్స్‌ హైలైట్‌గా ఉంటుంది. నాకు డ్యాన్స్‌ అంతగా రాదేమో అని మా టీమ్‌ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను.

► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్‌– అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో హీరోయిన్‌గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.  మిగతావి చర్చల్లో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా