మోయడానికి రెడీగా ఉన్నా... మీదే ఆలస్యం! | Sakshi
Sakshi News home page

మోయడానికి రెడీగా ఉన్నా... మీదే ఆలస్యం!

Published Fri, Jun 12 2015 11:18 PM

మోయడానికి రెడీగా ఉన్నా... మీదే ఆలస్యం!

హీరోలేనా? మేం కూడా మా భుజాల మీద సినిమాను మోయగలం.. అనే టైప్‌లో విద్యాబాలన్, కంగనా రనౌత్, అనుష్క శర్మ వంటి బాలీవుడ్ తారలు విజృంభిస్తున్నారు. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ వంటి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో విద్యా తన సత్తా చాటారు.     ఆ చిత్రాలు మంచి లాభాలు సాధించాయి. ఈ మధ్యకాలంలో కంగనా చేసినవన్నీ కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే. స్టార్ హీరోల చిత్రాలు సాధించినంత భారీ వసూళ్లు ఈ చిత్రాలు రాబట్టాయి.
 
 అలాగే, అనుష్కా శర్మ నటించి, నిర్మించిన ‘ఎన్‌హెచ్ 10’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దాంతో హిందీ రంగంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు డిమాండ్ పెరిగింది. మరి.. మీరలాంటి చిత్రాల్లో నటిస్తారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘తప్పకుండా నటిస్తా. ఆ తరహా చిత్రాలు నాకు ఎగ్జయిటింగ్‌గానే అనిపిస్తాయి. సినిమా మొత్తాన్నీ నా భుజాల మీద మోయడానికి రెడీగా ఉన్నా’’ అన్నారు.
 
 ఇక, రచయితలదే ఆలస్యం అనే తరహాలో శ్రుతి సమాధానం ఇచ్చారు. సినిమా మొత్తం తన పాత్ర చుట్టూ తిరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుందని, భవిష్యత్తులో అలాంటి చిత్రాలకు అవకాశం వస్తే, మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా అంగీకరిస్తానని శ్రుతి అన్నారు. కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేసినప్పుడు వచ్చే పేరు ప్రత్యేకంగా ఉంటుందని, హీరో ప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో గుర్తింపు రాదనలేమని, అవి కూడా పేరు తెస్తాయనీ శ్రుతీహాసన్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement