సగం పెళ్లి అయిపోయిందా?

18 Jun, 2019 07:17 IST|Sakshi
నటి రెజీనా

సినిమా: నిశ్చితార్థం జరిగితే శాస్త్రం ప్రకారం సగం పెళ్లి అయినట్లేనంటారు. అలా నటి రెజీనాకు ఆ వేడుక జరిగిపోయినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్న బ్యూటీ రెజీనా. నటిగా కొన్ని మంచి విజయాలనే తన ఖాతాలో వేసుకున్నా, ఎందుకనో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ని తెచ్చుకోలేకపోయింది. అయితే రెజీనాపై వదంతులు మాత్రం జోరుగానే సాగుతుండటం విశేషం. 26 ఏళ్ల ఈ బ్యూటీకి గత 13వ తేదీన వివాహ నిశ్చితార్థం  అత్యంత రహస్యంగా జరిగిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్త. ప్రస్తుతం అవకాశాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అవ్వాలని రెజీనా నిర్ణయించుకున్నట్లు టాక్‌.  దీంతో ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి త్వరలో పెళ్లి పీటలెక్కడానికి తొందర పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రెజీనా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మౌనం అర్ధ అంగీకారంగా నెటిజన్లు భావిస్తున్నారు.

ఇదిలాఉండగా ఈ అమ్మడు ఒక టాలీవుడ్‌ నటుడితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్‌ మాత్రమేనని ఇద్దరూ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే యువ నటుడు సందీప్‌కిషన్‌తో మొదట్లో రెజీనా ప్రేమ కలాపాలు సాగించినట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ మధ్య ఒక భేటీలో రెజీనా పేర్కొంటూ తన జీవితంలోకి ప్రేమ వచ్చి పోయిందని చెప్పింది. ఒకరినోకరం తొందరపడి దూరం అయ్యామేమోనని ఇప్పుడు అనిపిస్తోందని కూడా పేర్కొంది. ఆ తరువాత మొదటి ప్రేమికుడితో స్నేహం కొనసాగుతోందని రెజీనా చెప్పింది. ఇంతకీ రెజీనా పెళ్లి నిశ్చితార్థం విషయంలో నిజమెంత అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే నటి శ్రియ లాంటి కొందరు చడీ చప్పుడు లేకుండా ఆ ముచ్చట జరుపుకుని తీరిగ్గా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి పెళ్లి అయ్యిపోయిందోచ్‌ అంటున్నారు. నటి రెజీనా కూడా సడన్‌గా అలానే ప్రకటిస్తుందేమో చూడాలి. కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన నెంజమం మరప్పదిల్లై, దర్శకుడు వెంకట్‌ ప్రభు నిర్మించిన పార్టీ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు కాచుకున్నాయి. ఇకపోతే శింబుదేవన్‌ దర్శకత్వంలో వెంకట్‌ప్రభు నిర్మిస్తున్న కచడదపర అనే మరో చిత్రంలో నటించడానికి అంగీకరించింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’