ఆశలన్ని ఆ చిత్రంపైనే..!

12 Feb, 2019 09:49 IST|Sakshi

ఇటీవల నటి రెజీనా జోరు తగ్గిందనే చెప్పాలి. ఇటు కోలీవుడ్‌లోనూ, అటు టాలీవుడ్‌లోనూ కథానాయకిగా మంచి పేరు ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా తమిళంలో నటిస్తున్న ‘కళ్లపార్ట్‌’ చిత్రం మీద చాలా ఆశ పెట్టుకుంది రెజీనా. ఈ చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తోంది రెజీనా. మూవింగ్‌ ఫ్రేమ్స్‌ పతాకంపై ఎస్‌.పార్తీ,ఎస్‌.శీనా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథనం, దర్శకత్వ బాధ్యతలను పీ.రాజపాండి నిర్వహిస్తున్నారు.

ఈయన ఇంతకు ముందు ‘ఎన్నమో నడక్కుదు’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రెజీనా డ్యాన్స​ టీచర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెజీనా. ఇకపోతే బాలీవుడ్‌లో అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్‌ కపూర్‌ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్‌ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని వార్తలు