హైదరాబాద్ అమీనా | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ అమీనా

Published Sat, Jan 3 2015 12:18 AM

హైదరాబాద్ అమీనా - Sakshi

‘ఈ సిటీ ముంబయి, బెంగళూరు, ఢిల్లీలకన్నా చాలా బాగుంటుంది. రియల్లీ బ్యూటీఫుల్. నాకు ఈ నగరమంటే చాలా ఇష్టం’ అని హైదరాబాద్ గురించి మనసులో మాట చెప్పింది హిందీ ఆఫ్ బీట్ మూవీస్ నటి రేఖారాణా. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన అమీనా కథతో రూపొందుతున్న చిత్రంలో రేఖ నటిస్తోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం నగరానికి వచ్చిన ఈ నటి... తన గురించి తాను చెప్పిన మరికొన్ని సంగతులు ఆమె మాటల్లోనే...  
 
 మాది దిల్లీకి చెందిన వ్యాపార కుటుంబం. మొదటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. చదువుతున్నప్పుడు డ్రామాలవీ వేసిన అనుభవం ఉంది. చదువు పూర్తయ్యాక దిల్లీకి వచ్చి యాక్టింగ్ స్కూల్‌లో చేరా. అక్కడ కోర్సు చేస్తూనే నాలుగేళ్లలో దాదాపు 70కిపైగా థియేటర్ షోస్ చేశా. ఆ క్రమంలోనే పలు షార్ట్‌ఫిల్మ్స్, మూవీస్, మ్యూజిక్ వీడియోల్లో ఆఫర్లు వచ్చాయి. వాటిలో కొన్ని మంచి హిట్స్ అయ్యాయి. అవార్డ్స్ పొందాయి.
 
 ఆస్కార్ ఎంట్రీ...
 వెస్ట్రన్ ఆఫ్రికా దేశం సమర్పణలో భారతీయ నేపథ్యంలో తీసిన ‘తారా’ ఆస్కార్ ఎంట్రీకి క్వాలిఫై అవడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. దీన్ని రూపొందించిన వారంతా భారతీయులే. అయితే అందులో ఆఫ్రికా ప్రాంతంలో ఉంటున్నవారు కూడా ఉండడం వల్ల ఇది అక్కడి ‘టోగో’ దేశం తరపున ఎంట్రీ సాధించింది. ఇందులో నేను లీడ్ రోల్ చేశా. ఈ సినిమాకు దాదాపు 35 అంతర్జాతీయ, వ్యక్తిగతంగా నాకు 12 అవార్డులు వచ్చాయి.
 
 లవ్ ఎట్ ఫస్ట్‌‘ సైట్’  
 ఫస్ట్‌టైమ్ వచ్చినప్పుడే హైదరాబాద్ నా మనసు దోచుకుంది. అందరూ ఇక్కడి నుంచి ముంబై, గోవా వెళ్లి న్యూ ఇయర్ ఎంజాయ్ చేశారు. నేను మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి సెలబ్రేషన్స్ కోసం వచ్చా. ఎన్ కన్వెన్షన్‌లో డిసెంబర్ 31 పార్టీని బాగా ఎంజాయ్ చేశా. ఇక్కడ నాకు  మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడి ఓల్డ్‌సిటీ అమ్మాయి కథతో రూపొందుతున్న యహా అమీనా బిక్తీ హై అనే చిత్రంలో అమీనా పాత్ర చేస్తున్నా. అలాగే మలాలా పాత్రతో రూపొందుతున్న సినిమాకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి.
 
 జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్...
 నేను అన్నీ ఆఫ్‌బీట్ సినిమాలే చేస్తున్నాను కాబట్టి ఇక వాటికే పరిమితం అవుతానని కాదు. సరైన అవకాశం వస్తే ఐటంసాంగ్‌తో కూడా నిరూపించుకుంటా. అలాగే మంచి లవ్‌స్టోరీస్, ఎంటర్‌టైనర్‌లలో నటించాలని ఉంది. మంచి ఆఫర్లు వస్తే టాలీవుడ్‌లోనూ చేస్తా. నటినే కాదు... నేను మంచి డ్యాన్సర్, సింగర్‌ను కూడా. ‘తార’ మూవీలో ఒక పాట పాడా. నేను నటించిన తారా సినిమాకు ఆస్కార్ ఎంట్రీ రావడమే గొప్ప అఛీవ్‌మెంట్. ఇక  అకాడమీ అవార్డ్ కూడా వస్తే... వావ్... అదొక అద్భుతం నిజంగా!  
 - ఎస్.సత్యబాబు

Advertisement
Advertisement