ఈ భామ ఎవరో చెప్పుకోండి చూద్దాం..

1 Jul, 2015 15:51 IST|Sakshi
ఈ భామ ఎవరో చెప్పుకోండి చూద్దాం..

ముంబై:  ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టండి చూద్దాం... ఒక అరగంటలోఈ అమ్మాయి ఎవరో చెప్పాలి.. నో క్లూస్ ప్లీజ్...
అవును... చుక్కల్లారా.. మబ్బుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆపద్బాంధవుడు హీరోయిన్, బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి.


బాలీవుడ్  హీరో రిషీ కపూర్ తన అభిమానులకు ఈ పరీక్ష పెట్టారు. ఈ అమ్మాయి ఎవరో చెప్పుకోండి.. నేనైతే అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా.. మరి మీరు.. ఎలాంటి క్లూ లేవు.. అంటూ ఒక ఫోటోను ట్విట్టర్లో  షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో పలు సామాజిక అంశాలపై  స్పందిస్తున్న బాబీ హీరో.. తాను మీనాక్షి శేషాద్రితో కలిసి ఉన్న ఫోటోలను  పోస్ట్ చేశారు.  దీంతో ఈ  ఫోటో ట్విట్టర్లో సందడి చేసింది.   


దీంతోపాటు  ఫ్యాన్స్ కు  మీనాక్షికి సంబంధించిన వివరాలను అందించారు. మైసూరుకు చెందిన హరీష్ను పెళ్ళి చేసుకుని ఒక పాప, బాబుతో అమెరికాలోని డలస్లో  చాలా సంతోషంగా జీవిస్తోందని  తెలిపారు. మంచి పాత్ర వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉంది అన్నారు. నటిగా మీనాక్షికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన దామిని హిందీ సినిమాలో  రిషీకపూర్తో కలిసి జంటగా నటించారు  మీనాక్షి. అయితే ఇటీవల ముంబైలో ఒక ఫంక్షన్లో ప్రత్యక్షమవడంతో ఆమె మళ్లీ సినిమాలో నటించబోతున్నారనే వార్తలొచ్చాయి.  కానీ  ఆ తర్వాత మీనాక్షి  ప్రస్తుతానికి  అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆ వార్తలను తేలిగ్గా  తోసిపుచ్చారు.