పిచ్చైక్కారన్‌కు పన్ను మినహాయింపు | Sakshi
Sakshi News home page

పిచ్చైక్కారన్‌కు పన్ను మినహాయింపు

Published Thu, Mar 3 2016 3:24 AM

పిచ్చైక్కారన్‌కు పన్ను మినహాయింపు

ఇప్పుడు యూ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకే రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు పొందడం గగనం అయిపోతోంది. అలాంటిది పిచ్చైక్కారన్ చిత్రం ఏకంగా వినోదపు పన్ను మినహాయింపు అర్హతను పొందడం విశేషం అనే చెప్పాలి. సాధారణంగా మంచి సందేశంతో కూడిన అతి కొద్ది చిత్రాలకే ప్రభుత్వం వినోదపు పన్నును రద్దు చేస్తుంది.
 
 అలాంటిది కమర్షియల్ అంశాలతో కూడిన పిచ్చైక్కారన్ చిత్రం ఈ కేటగిరీలో చేరడం చెప్పకోదగ్గ విషయం. సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోనీ హీరోగా నటించి, సంగీతాన్ని అందించి తన విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. డిష్యుం చిత్రంతో విజయ్‌ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన శశి ఈ చిత్రానికి దర్శకుడు.
 
 సాట్నా టిటూస్, భగవతి పెరుమాళ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్‌ను పొంది శుక్రవారం తెరపైకి రానుంది. దీని విడుదల హక్కుల్ని ఆర్‌కే.ఫిలింస్, స్కైలార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు పొందా యి. కాగా కమర్షియల్ చిత్రంగా రూపొందిన పిచ్చైక్కారన్‌కు ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయిం పునిచ్చిందని ఆర్‌కే.ఫిలింస్ అధినేతలలో ఒకరైన శరవణన్ వెల్లడించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement