రాయబారం ఫలించిందా? | Sakshi
Sakshi News home page

రాయబారం ఫలించిందా?

Published Thu, Nov 23 2017 1:05 AM

SAIF ALI KHAN IN TALKS TO STAR IN A BIOPIC - Sakshi

హెడ్డింగ్‌ చదవగానే, ఇక్కడున్న ఫొటోలు చూడగానే.. ఎవరు ఎవరికి రాయబారం పంపారనే ఊహాల్లోకి వెళ్లిపోయారా? సైఫ్‌కి ఇలియానా రాయబారం పంపారనుకుంటున్నారా? అది నిజం కాదు. మరి.. సైఫ్‌ ఆమెకు పంపారనుకుంటున్నారా? అదీ నిజం కాదు. అయితే సైఫ్‌ రాయబారం చేశారు. ఒక సినిమా అవకాశం కోసం దర్శకుడు శివమ్‌ నాయర్‌కి రాయబారం పంపించారు. అడిగి మరీ సినిమాలు చేయాల్సిన అగత్యం సైఫ్‌కి లేదు. మరెందుకలా చేసినట్లు అనుకుంటున్నారా? మరేం లేదు.

పాక్తిస్తానీ తాహీర్‌ని ప్రేమించి, మోసపోయిన భారతీయ వనిత ఊజ్మా అహ్మద్‌ జీవితం ఆధారంగా శివమ్‌ ఓ సినిమా తీయనున్నారు. ఇందులో మెయిన్‌ లీడ్‌ రోల్‌ను సైఫ్‌ చాలా ఇష్టపడ్డారు. ఇష్టపడ్డ పాత్ర కోసం రాయబారం పంపితే ఏమవుతుందనుకున్నారు? అందుకే తన సిస్టర్‌ సోహ భర్త, నటుడు కునాల్‌తో రాయబారం పంపారన్నది బాలీవుడ్‌ సమాచారమ్‌. ‘‘స్క్రిప్ట్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. మరో 20 రోజుల్లో పూర్తవుతుంది. సైఫ్‌తో మాట్లాడాను. స్టోరీ నెరేట్‌ చేసిన తర్వాత అంతా ఓకే అయితే సైఫ్‌నే మేల్‌ లీడ్‌గా నటిస్తారు’’ అని పేర్కొన్నారు నాయర్‌. సైఫ్‌ రాయబారం ఫలించినట్లే ఉంది కదండీ!

Advertisement

తప్పక చదవండి

Advertisement