నాకు బాగా నచ్చే నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి

20 Sep, 2018 10:46 IST|Sakshi

తరచుగా ఇక్కడికి వస్తుంటా.. 

రెండేళ్ల గ్యాప్‌లో రీచార్జ్‌ అయ్యా.. 

సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో 

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌  

అమితాబ్‌ బచ్చన్‌ తనయుడిగా, ఐశ్వర్యారాయ్‌ భర్తగా, బాలీవుడ్‌ స్టార్‌గా చిరపరిచితమైన నటుడు అభిషేక్‌ బచ్చన్‌ బుధవారం నగరానికి వచ్చారు. ప్రముఖ వాచీల బ్రాండ్‌ ‘ఒమెగా’ కొత్త కలెక్షన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువిషయాలపై మాట్లాడారు. సిటీతో నకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు..     

మీరు మూవీస్‌ నుంచి రెండేళ్ల గ్యాప్‌ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది! 
నేనేమీ సినిమాలను వద్దనుకోలేదు. ఇక నటించను అని నిర్ణయం తీసుకోలేదు. అయితే, సినిమాల నుంచి కొంత విరామం కోరుకున్నాను. ఎందుకో ఒకే తరహా సినిమాలు చేస్తూ పోతున్నాననిపించింది. నాకు నటించాలనే ఆసక్తి కలిగించే పాత్ర కోసం ఎదురు చూశాను. అందుకే రెండేళ్ల గ్యాప్‌ వచ్చింది. 

మీ తాజా సినిమా అలాంటిదే అనుకోవచ్చా?  
అవును. ‘మన్మార్జియాన్‌’లో చేసిన పాత్ర నేను ఎదురు చూసిన పాత్రలాంటిదే. ఇప్పుడు దానికి వస్తున్న స్పందన నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. విరామం తర్వాత మంచి సినిమా రావడంతో టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అన్నట్టు ఫీలవుతున్నాను.   

మీరిప్పుడు ఫుల్‌గా రీచార్జ్‌ అయినట్టేనా?  
ఫుల్‌గా.. (నవ్వుతూ), ఇప్పుడు బాగా రీచార్జ్‌ అయ్యాను. డెఫినెట్‌గా డిఫరెంట్‌ రోల్స్‌తో మళ్లీ మళ్లీ మీకు కనిపిస్తుంటాను.  

బ్రేక్‌ గురించి ఫ్యామిలీ ఏమంది? టైమ్‌ ఫుల్‌గా ఫ్యామిలీకి కేటాయించారేమో..! 
వాళ్లు చాలా సపోర్టివ్‌. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడూ మద్ధతుగానే ఉంటూ వచ్చారు. ఫ్రీ టైమ్‌ ఎక్కడిది? సినిమాలు లేకపోయినా నాకు ఉన్న ఇతర వ్యాపకాలతో బిజీగానే గడచిపోయింది. టైమ్‌ దొరికితే కుటుంబంతో కలిసి డిన్నర్‌ చేయడం వంటివి నాకు చాలా ఇష్టమైన పనులు. కానీ అలాంటి అవకాశాలు అరుదుగానే వస్తుంటాయి.   

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ (కబడ్డీ) చెన్నైన్‌ ఎఫ్‌సీ (ఫుట్‌బాల్‌) స్పోర్ట్స్‌ టీమ్స్‌కు కో ఓనర్‌గా ఉన్నారు. అటు ఎందుకెళ్లారు? 
అవును.. స్పోర్ట్స్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా కబడ్డీ, ఫుట్‌బాల్‌ అంటే బాగా ఇష్టం. ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా అనేది తెలుసుకునేందుకు స్పోర్ట్స్‌ బాగా ఉపయోగపడతాయి. పోరాడే తత్వాన్ని అందిస్తాయి. సినిమాల నుంచి తీసుకున్న రెండేళ్ల గ్యాప్‌లో నేను అత్యధిక సమయం స్పోర్ట్స్‌ టీమ్స్‌కే కేటాయించాను.   

దక్షిణాది సినిమాల్లో కనిపించిచాలా కాలమైంది కదా! 
నాకు చేయాలని ఇష్టం ఉంది. అయితే నాకేమీ మంచి ఆఫర్‌ రాలేదు. వస్తే తప్పకుండా నటిస్తాను. అది ఏ భాష అయినా సరే నాకు ఇబ్బంది లేదు.  

18 ఏళ్ల నట జీవితం సంతృప్తిని అందించిందా? 
లేదు. నిస్సందేహంగా లేదు. మీరు ఏ యాక్టర్‌ని అడిగినా.. ఇదే సమాధానం వస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌ గారు 50 ఏళ్లుగా నటిస్తున్నారు. ఆయనకు ఎప్పుడూ సంతృప్తి అనేది ఉండదు. ఇంకా ఇంకా మంచి పాత్రలు నటించాలనే ఆకలితోనే ఉంటారు. తనను తాను మరింతగా ప్రూవ్‌ చేసుకోవాలని తహతహలాడుతూనే ఉంటారు. 
 
 మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? నెక్స్ట్‌ అమితాబ్‌ నా? 
అమితాబ్‌ బచ్చన్‌గా మరెవరూ కాలేరు. నేను జస్ట్‌ అభిషేక్‌ బచ్చన్‌ కావాలనుకుంటున్నానంతే(నవ్వుతూ).  ప్రస్తుతం 2, 3 ప్రాజెక్ట్స్‌ చర్చలు నడుస్తున్నాయి. వచ్చే పది రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన వస్తుంది. నాకు సమయం దొరికితే నా కూతురుతోనే ఉంటా. 

జూబ్లీహిల్స్‌: అభిషేక్‌ బచ్చన్‌ బుధవారం జూబ్లీహిల్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఒమేగా గడియారాల షోరూంను ప్రారంభించారు. అనంతరం కంపెనీకి చెందిన ప్రసిద్ధ బ్రాండ్‌ ‘సీ మాస్టర్‌ డైవర్‌ 300 ఎం’ కలెక్షన్‌ను దేశంలో మొదటిసారి ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు తరచూ వస్తుంటానని, ప్రత్యేకించి మాదాపూర్‌లో కనీసం ఒక్క భవనం కూడా లేని రోజలు తనకు బాగా గుర్తున్నాయన్నారు. కార్యక్రమంలో కంపెనీ అంతర్జాతీయ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రెడరిక్‌ నార్డిన్, కమల్‌వాచ్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’