'మా ఆయన ఓ ఏంజెల్' | Sakshi
Sakshi News home page

'మా ఆయన ఓ ఏంజెల్'

Published Mon, Jun 27 2016 8:30 AM

'మా ఆయన ఓ ఏంజెల్' - Sakshi

లాస్ ఎంజెల్స్: తన భర్తను చూడకుండా అస్సలు ఉండలేనని ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయేక్ తెలిపింది. ఆమె భర్త ప్రాంకోయిస్ పినాల్ట్ ఒక ఏంజెల్ అని, సెయింట్ అని పొగడ్తల్లో ముంచేసింది. 'వ్యాపార వేత్త అయిన నా భర్త ఒక దైవ దూత, మంచి రుషి. మేమిద్దరం కూడా ఒకరినొకరం చూసుకోకుండా అస్సలు ఉండలేము. నేను ఆయన షెడ్యూల్ ప్రకారమే పనిచేస్తాను కూడా.

ఒక వేళ సినిమా షూటింగ్లో దూరంగా చాలా కాలంపాటు వెళ్లాల్సి ఉండి అది నా కుటుంబానికి ప్రతికూలంగా ఉంటే మాత్రం దానిని తిరస్కరిస్తాను' అని ఆమె చెప్పింది. తన భర్త చాలా నైస్ గాయ్ అని, చాలా టఫ్ బిజినెస్మేన్ అని చెప్పింది. ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా పరిస్థితికి తగినట్లుండే స్మార్ట్ అని తెలిపింది. చాలామంది ఆయనను చూసి భయపడుతుంటారా అని అది చూసి తను మాత్రం చాలా లక్కీ అని ఫీలవుతుంటానని వెల్లడించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement