చారిత్రక చిత్రంలో సల్మాన్ ఖాన్ | Sakshi
Sakshi News home page

చారిత్రక చిత్రంలో సల్మాన్ ఖాన్

Published Sat, Sep 24 2016 12:54 PM

చారిత్రక చిత్రంలో సల్మాన్ ఖాన్

వరుస బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ను శాసిస్తున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఓ చారిత్రక చిత్రానికి అంగీకిరంచాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటించడం లేదట. అసలు తన పాత్ర ఏంటో కూడా తెలుసుకోకుండా సల్మాన్ ఈ సినిమాకు ఓకె చెప్పాడట.

బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్లో నేషనల్ అవార్డ్ సాధించిన రవి జాదవ్ దర్శకత్వంలో శివాజీ జీవితకథ ఆధారంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు సల్మాన్ను సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నాడు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ తమ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తుండటంపై హీరో రితేష్తో పాటు చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement