Sakshi News home page

బిగ్ బాస్ : ఒక్కో ఎపిసోడ్ కి 11 కోట్లు

Published Sun, Sep 24 2017 11:22 AM

Salman Khan Gets 11 Crore Per Episode For Hosting Bigg Boss 11

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ మేనియా నడుస్తోంది. ప్రపంచ దేశాల్లో ఘనవిజయం సాధించిన ఈ రియాలిటీ షో హిందీలో రూపొంది ఘనవిజయం సాధించింది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిలో పది సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అక్టోబర్ 1 నుంచి 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే బిగ్ బాస్ 10కు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 8 కోట్ల వరకు పారితోషికం అందుకున్న సల్మాన్, సీజన్ 11 కోసం మరింత భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడట. అయితే సల్మాన్ కారణంగా షో ఇంతటి విజయం సాధించిందని భావిస్తున్న షో నిర్మాహకులు ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు 11 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

What’s your opinion

Advertisement