సల్మాన్‌ ఇంట్లో గణపతి పండుగ లేదు.. | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఇంట్లో గణపతి పండుగ లేదు..

Published Tue, Aug 22 2017 11:21 AM

సల్మాన్‌ ఇంట్లో గణపతి పండుగ లేదు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఈ సారి తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపడంలేదు. గత 15 ఏళ్లుగా తన ఇంట్లో సేద తీరి ఖాన్‌ ఫ్యామిలీ పూజలందుకున్న బొజ్జ గణపయ్య ఈ చవితికి మాత్రం ఆ ఇంటికి దూరం కానున్నాడు.
 
బాలీవుడ్‌ సమాచారం మేరకు సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్‌ ఇంట్లో ఖాన్‌ కుటుంబ సభ్యులు వినాయక ఉత్సవాలు జరుపుకోనున్నారు. సల్మాన్‌ మాత్రం  ‘టైగర్‌ జిందా హై’  చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గతేడాది ‘ట్యూబ్‌లైట్‌’  చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండి వినాయక ఉత్సవాలకు హాజరుకాలేకపోయాడు.  ఈ సారి మాత్రం వినాయక చవితి ఒక్కరోజు అర్పితా ఇంట్లో కొలువయ్యే బప్పాను పూజించనున్నాడు. 

Advertisement
Advertisement