బ్యాచిలర్‌ పార్టీలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

25 Sep, 2017 01:09 IST|Sakshi

బ్యాచిలర్స్‌ పార్టీల్లో ఎవరెవరు కనిపిస్తుంటారు? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి స్నేహితులు. బహుశా... శనివారం రాత్రి అయ్యుండొచ్చు! అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ ఫ్రెండ్స్‌కి బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చారట! రామ్‌చరణ్, చైతూ తమ్ముడు అఖిల్‌ నుంచి మొదలుకొని చైతూ–సమంత స్నేహితులు ఎందరో పార్టీకి వచ్చారు.

వాళ్లలో ఒకతనున్నాడు... మీసం లేదు, గడ్డం లేదు, మాంచి హ్యాండ్సమ్‌ పర్సనాలిటీ! అతన్ని ఎవరైనా కాస్త దూరం నుంచి చూస్తే 30 ప్లస్‌ వ్యక్తి అనుకోవడం గ్యారెంటీ. దగ్గరకు వెళితే... అతనెవరో కాదు, ‘కింగ్‌’ నాగార్జున అని తెలిసి, కొంతమంది ఆశ్చర్యపోయారట. యస్‌... చైతూ–సమంత బ్యాచిలర్‌ పార్టీలో ఎవర్‌గ్రీన్‌ మన్మథుడు నాగార్జున స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారట! కుమారులతో నాగార్జున ఎప్పుడూ ఓ తండ్రిలా కాకుండా, ఫ్రెండ్‌లా ఉంటుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందువల్లే, చైతూ తండ్రిని స్పెషల్‌గా పిలిచుంటారు. అఖిల్‌ కూడా ‘ఎ నైట్‌ ఎమాంగ్‌ స్టార్స్‌... మై త్రీ ఓల్డర్‌ బ్రదర్స్‌’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. అందులో చరణ్, చైతూ, అఖిల్‌ కాస్త గడ్డాలతో కనిపిస్తుంటే... క్లీన్‌ షేవ్‌ లుక్‌తో నాగ్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఈ పార్టీతో చైతూ–సమంతల పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల 6న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి షాపింగ్‌లో బిజీగా ఉన్నారట!!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు