సూర్యకు సిగ్గెక్కువ | Sakshi
Sakshi News home page

సూర్యకు సిగ్గెక్కువ

Published Tue, Sep 13 2016 1:48 AM

సూర్యకు సిగ్గెక్కువ

నటుడు సూర్యకు సిగ్గెక్కువ అనీ, ముఖ్యంగా కథానాయికలతో మాట్లాడడానికి తెగ సిగ్గుపడిపోతారని అన్నదెవరో తెలుసా? ఇంకెవరు ఆయనతో రెండు చిత్రాలలో రొమాన్స్ చేసిన చెన్నై చిన్నది సమంతే. నటన, ప్రేమ, త్వరలో పెళ్లి అంటూ ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గురించి మీడియాలో చాలానే ప్రచారం జరుగుతోంది. అయితే తన ప్రేమను, ప్రియుడిని బహిరంగంగానే వెల్లడించి ఆనక నాలుక కరుచుకున్న ఈ సంచలన తార తాజాగా ఇచ్చిన భేటీలో చాలా ఆచితూచి మాట్లాడారు. తాజాగా తాను నటించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న సమంత త్వరలో తమిళంలో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల సమంత పత్రికల వారికిచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం.
 
ప్ర: మీ ప్రేమ, పెళ్లి విషయాలిప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మారాయి. వివాహ ఘడియలు ఎప్పుడు?
 జ: నేను ఏడాది కాలం నుంచి ప్రేమలో ఉన్నానని ఇప్పటికే చెప్పాను. అందువల్ల ప్రియుడెవరూ? పెళ్లి ఎప్పుడూ? అన్న ప్రశ్నలు ఇక అడగకండి. నాకు మంచి కుటుంబం కావాలి. మంచి పిల్లలు కావాలి. మా వివాహ తేదీని సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతాను.
 
ప్ర: కొత్త చిత్రాలను అంగీకరించడం లేదు. నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారా?
 జ: వరుసగా చాలా చిత్రాలు చేయడం వల్ల కాస్త విరామం అవసరం అనుకున్నాను. అయితే ఆ సమయాన్ని కూడా ఇంటిలో వంటలు నేర్చుకోవడానికి ఉపయోగించాను. మరో విషయం ఏమిటంటే పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పను. నేను కలిసి జీవించే కుటుంబ గౌరవానికి భంగం కలగని విధంగా పాత్రలను ఎంచుకుని నటిస్తాను.
 
ప్ర: భవిష్యత్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
 జ: సినిమాలో ఏదీ నిరంతరం కాదు.ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక్కొక్కరి తలరాత మారిపోతుంది. ధనం, కీర్తి ఏదీ శాశ్వతం కాదు. అందువల్ల నాకు భవిష్యత్ ప్రణాళిక అంటూ ఏదీ లేదు. మంచి కథాపాత్రల్లో నటించాలన్న ఆశ మాత్రమే ఉంది.
 
ప్ర: సామాజిక సేవ గురించి?
 జ: ఒక సయమంలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాను. అప్పుడు జీవితం గురించి చాలా ఆలోచించాను. అందులోంచి పుట్టిందే బాలలకు సాయం చేయాలన్న ఆలోచన. అందుకు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థే ప్రత్యూష ఫౌండేషన్. నేను సినిమాల్లోకి రాకముందు రెండు బస్సులు మారి కాలేజీకి వెళ్లి వచ్చేదాన్ని. అలాంటి పరిస్థితుల్లోనూ మా అమ్మ పేదలకు సాయం చేయడానికంటూ కొంత డబ్బు కేటాయించేవారు. ఇప్పుడు నా వద్ద చాలా డబ్బు ఉంది. దాంతో ఇతరులు సాయం కోసం చూస్తున్నాను.
 
 ప్ర: మీరు జత కట్టిన నటులు సూర్య, మహేశ్‌బాబుల గురించి?
 జ: సూర్య వృత్తిపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు. సహ కథానాయికలతో మాట్లాడడానికి చాలా సిగ్గుపడతారు. అయితే చాలా శ్రమజీవి. ఇక మహేశ్‌బాబు మనసులో ఉన్నది చెప్పేస్తారు. వృత్తిలో అంకితభావం చూపుతారు.
 
 ప్ర: మీకు తీరని కోరిక ఏదైనా ఉందా?
 జ: అందరు కథానాయకులతోనూ నటించాలనీ, అదే విధంగా ప్రముఖ కాథానాయకులతో, ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించాలన్న కోరక ఉండేది. ఇవన్నీ జరిగాయి. కాబట్టి తీరని కోరిక అంటూ ఏమీలేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement