ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా! | Sakshi
Sakshi News home page

ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా!

Published Tue, Jul 11 2017 2:02 AM

ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా!

సమంతకు ఆల్రెడీ పెళ్లయింది! ఈ సంగతి స్వయంగా ఆమే బయట పెట్టారు. ‘అవునా? ఎవరితో పెళ్లైంది!’ అని ఆశ్చర్యపోతున్నారా? ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకున్నది నాగచైతన్యనే. ‘అదేంటి? ఈ అక్టోబర్‌ 6న చైతూ–సమంతల పెళ్లి అని వార్తలొస్తున్నాయి. అది అబద్ధమా? అసలు వీళ్లెప్పుడు పెళ్లి చేసుకున్నారు’ అనే డౌట్‌ వచ్చిందా? మెంటల్‌గా పెళ్లి జరిగిందట! ట్విట్టర్‌లో సమంత ఫాలోయర్ల సంఖ్య నాలుగు మిలియన్లకు (40 లక్షలకు) చేరింది.

ఈ సందర్భంగా సమంత ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ‘త్వరలోనే చైతూతో పెళ్లి! మీ ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయి?’ అనడిగాడో అభిమాని. ఈ ప్రశ్నకు సమాధానంగా సమంత ‘‘నా మైండ్‌లో ఆల్రెడీ అతన్ని పెళ్లి చేసేసుకున్నా. సో, మాకంటే మిగతా వాళ్లందరూ ఎక్కువ ఎగై్టటెడ్‌గా ఉన్నట్టున్నారని నా ఫీలింగ్‌’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement