సమంత స్టన్నింగ్‌ ఫోటో | Sakshi
Sakshi News home page

సమంత స్టన్నింగ్‌ ఫోటో

Published Fri, Jul 7 2017 5:09 PM

Samanthaprabhu on the latest cover of JGW Magazine




హైదరాబాద్‌: విమెన్‌ మ్యాగజీన్‌ ‘జెఎఫ్‌డబ్ల్యు’ (జస్ట్‌ ఫర్‌ విమెన్)  కవర్‌పేజీపై టాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్‌ సమంత మెరిసిపోతోంది. సన్నింగ్‌ లుక్‌ లో జెఫ్‌డబ్ల్యు  ముఖచిత్రంపై   చేనేత వస్త్రాల్లో దర్శనమిచ్చింది.  దీంతో అటు  నాగ చైతన్య , ఇటు సామ్‌  ఫ్యాన్స్‌  ఫిదా అయిపోతున్నారట. ఫాన్స్‌ ట్వీట్‌ చేసిన తాజా ఫోటోను సమంత రీట్వీట్‌ చేసింది.

ముచ్చటైన  ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం ఈ అక్టోబర్‌ 6న గోవాలో వైభవంగా నిర్వహించన్నారని తెలుస్తోంది. అభిమానులతోపాటు, మొత్తం సినీ పరిశ్రమ ఆసక్తిగా  వెయిట్‌ చేస్తున్న  వీరి పెళ్లిని  అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారని టాలీవుడ్‌ టాక్‌.

కాగా ప్రస్తుతం రాజుగారి గది– 2, రామ్‌చరణ్‌కు జోడీగా  వస్తున్న చిత్రాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.  పెళ్లికి ముందే   చేతిలో ఉన్న  ప్రాజెక్టులను పూర్తి చేసి పెళ్లి పీటలెక్కేందుకు  సన్నద్ధమవుతోంది.  త్వరలోనే  ప్రియుడు, హీరో   నాగ  చైతన్యతో  ఏడుఅడుగులు వేయబోతున్న  సమంత ఇటీవల ఫొటో షేరింగ్‌ సైట్‌ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.   ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన  ఫోటోలతో   అభిమానులను విపరీతంగా  ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement