‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’

23 Apr, 2020 16:25 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌లు బాలీవుడ్‌లో స్టార్‌ హీరో, హీరోయిన్‌. అయితే వీరిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారంటే టక్కున నోటితో చెప్పేయొచ్చు. అవి కూడా హ్యాపీ ఎండింగ్‌ లేని ప్రేమకథలే. మరో విషయం ఏంటంటే వీరిద్దరూ నటించిన మొదటి సినిమాలోనే అన్నాచెల్లెల్లుగా కనిపించారు. ఇక దీనిపై షారుక్‌ మాట్లాడుతూ.. మాజీ ప్రపంచ సుందరికి నేను అన్నగా నటించినందుకు ఇప్పటికీ  బాధపడుతుంటానని ఓ ఆవార్డు కార్యక్రమంలో వెల్లడించాడు. అంతేగాక ఐశ్వర్యతో నటించే అవకాశం వచ్చినా దాన్ని తాను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యానంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా ఈ కార్యక్రమంలో  షారుక్‌, ఐశ్వర్యకు ఆవార్డును ప్రదానం చేశాడు. (కరోనా : షారుక్‌ సాయం.. అభినందించిన మంత్రి)

అనంతరం షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘ఐశర్య విషయంలో నేను చాలా దురదృష్ట​ వంతుడిని. ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యకు మా మొదటి చిత్రం ‘జోష్’‌లో సోదరుడిగా నటించాను. అందులో మేమీద్దరం కవల పిల్లలం. అంతేకాదు కవలలుగ నటించిన మా ఇద్దరిని చూసి ఒకేలా ఉన్నారంటూ అందరూ చెప్పేవారు. ఇప్పటికీ కూడా మేమీద్దరం ఒకేలా ఉంటామన్న భ్రమలోనే ఉన్నాను’  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సంజయ్‌ లీలా భాన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వీరిద్దరి రెండవ చిత్రం ‘దేవదాస్’‌ గురించి చెబుతూ.. ‘‘ ఇందులో మేము ప్రేమికులుగా నటించాం. కానీ ఈ సినిమాలో నేను, తనని విడిచి పెట్టాను. తిరిగి నేను ఐశ్వర్యను ప్రేమించినప్పటికీ అప్పటికి ఆమె నన్ను విడిచి పెట్టింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య నన్ను ప్రేమించే అవకాశమే రాలేదు(తెరపై). అయితే ఒక్క విషయంలో మాత్రం అదృష్టవంతుడి కనీసం ఒక్కసారైనా తెరపై ఐశ్వర్యను ప్రేమించే అవకాశం వచ్చింది’’ అంటూ చమత్కారించాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా