గ్రాఫిక్ నవలలో... | Sakshi
Sakshi News home page

గ్రాఫిక్ నవలలో...

Published Tue, Jan 20 2015 11:59 PM

గ్రాఫిక్ నవలలో... - Sakshi

 బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 2016లో ‘అథర్వ’గా అలరించనున్నారు. అయితే ఆయన కనపడేది వెండితెరపై కాదు. పుస్తక రూపంలో. చెన్నైకు చెందిన విర్జూ స్టూడియోస్ ఈ  గ్రాఫిక్ నవలకు శ్రీకారం చుట్టింది.  ఈ గ్రాఫిక్ నవలలో అథర్వాగా షారుక్ పుస్తక ప్రియులను అలరించనున్నారు. డైనోసార్స్ జీవించిన కాలం ముందు జరిగిన కథకు అక్షర రూపమే ఈ నవల. దీన్ని చదివే పాఠకుల ఊహకు ఏమాత్రం తగ్గకుండా ఆనాటి పాత్రలను కళ్లకు కట్టేలా త్రీడీ టెక్నాలజీ పరిజ్ఞానంతో కథలోని ముఖ్యఘట్టాలను  రూపొందించనున్నామని నవలా రచయిత రమేష్ థమ్మిలని చెప్పారు. విశేషం ఏంటంటే.. ఈ నవలకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.
 
 ఈ టీజర్‌ను చూసిన షారుక్ అభిమానులు దీన్ని సినిమాగా తీయాలని కోరుతున్నారట. కానీ, తెరరూపం ఇవ్వడ అంత సులువు కాదనీ, చాలా సమయం పడుతుందని, దాని గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని  రమేష్ థమ్మిలని పేర్కొన్నారు  ‘‘ ఈ నవల గురించి షారుక్‌ఖాన్‌ను సంప్రదించాం. ఆయన మా కష్టాన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి వెంటనే అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. ఈ బుక్ డిజైన ర్ రమేష్  ఆచార్య  మాట్లాడుతూ -‘‘ఈ నవల స్మార్ట్ టీవీలు, ఇ-బుక్ ఫార్మట్‌లలో వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement