చిన్మయ శ్రీపాదపై షారుఖ్ ప్రశంసల జల్లు!

13 Aug, 2013 02:06 IST|Sakshi
Courtesy: https://www.facebook.com/pages/Chinmayi-Sripada/130027849040
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనేలు నటించిన తాజా చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డుల పట్టాలపై పరుగులు పెడుతోంది. అంతే వేగంతో ఆ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకుల మదిలోకి దూసుకెళ్లుతున్నాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో 'తిత్లీ' పాటను పాడిన చిన్మయ శ్రీపాదను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
 
తాజాగా చిన్మయను షారుఖ్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తాడట. జూలై జరిగిన ఆడియో ప్రారంభ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ 'తిత్లీ' పాటను మెచ్చుకుంటూ ట్విట్ చేశారని చిన్మయ తెలిపింది. తన జీవితంలో షారుక్ ప్రశంసలు మరిచిపోలేనని చిన్మయ వెల్లడించింది. ఆడియో కార్యక్రమంలో షారుక్ ని సంగీత దర్శకుడు శేఖర్ పరిచయం చేశాడు. షారుక్ ఖాన్ ఓ సూపర్ స్టార్.. కాని ఆయన మాటతీరు, మాటల్లో మాటతీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది.