ఇది షాహిద్‌ సినిమా కాదు! | Sakshi
Sakshi News home page

ఇది షాహిద్‌ సినిమా కాదు!

Published Wed, Jun 19 2019 3:26 AM

Shahid Kapoor and Kiara Advani open up about the world of Kabir Singh - Sakshi

విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్‌ రెడ్డి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాహిద్‌ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్‌ దర్శకత్వంలోనే ‘కబీర్‌సింగ్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ అయింది. ఈ నెల 21న చిత్రం విడుదల కానున్న సందర్భంగా షాహిద్, కియారా చెప్పిన విశేషాలు.

► ‘కబీర్‌సింగ్‌’ చిత్రం కోసం తిరిగి కాలేజీకి వెళ్లడాన్ని ఎలా ఫీల్‌ అవుతున్నారు?
చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను దాదాపు పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాలి. ఇప్పుడే వచ్చిన కొత్త హీరో అనే ఫీల్‌ని ఆడియన్స్‌కి కలగజేయాలి. ఈ సినిమాలోలా రియల్‌ లైఫ్‌లోనూ నేను ఎమ్‌బీబీఎస్‌ స్టూడెంట్‌ కావడంతో ఈజీ అయింది. టీజర్‌ చూసినవాళ్లు కాలేజీ స్టూడెంట్‌లానే ఉన్నారని చెప్పగానే ఆనందం అనిపించింది. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు నా వయసు పాతికేళ్లు కాదు.

► తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా?
చూశాను. బాగా నచ్చింది. సినిమాలోని క్యారెక్టర్, ఎమోషనల్‌ థింగ్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాను. ఈ ఫిల్మ్‌ మేకింగ్‌ని ఎంజాయ్‌ చేశాను. హీరోది చాలా గొప్ప పాత్ర. విజయ్‌ బాగా చేశాడు.

► ‘అర్జున్‌రెడ్డి’ అప్పుడు విజయ్‌ చేసింది తక్కువ సినిమాలు. మీరు 30కి పైగా సినిమాలు చేశారు కాబట్టి అంచనాలు ఉంటాయి. ప్రెషర్‌ ఏమైనా?
ఇలాంటి సబ్జెక్ట్‌ను కొత్త హీరో అయితే డిఫరెంట్‌ ఎనర్జీతో చేస్తారు. అలాగే నాలాంటి ఎస్టాబ్లిష్డ్‌ యాక్టర్‌ ఇలాంటి క్యారెక్టర్‌ చేసినప్పుడు కూడా డిఫరెంట్‌గానే  ట్రై చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్డ్‌ యాక్టర్స్‌కు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేయడం కొంచెం కష్టం అనిపించొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్‌ ఒకసారి సినిమా చూశారు. అంతకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలి. అయినా ఈ సినిమా వరకూ ఆడియన్స్‌ ఇందులోని క్యారెక్టర్‌ని చూస్తారు. మన గురించి అంతగా ఆలోచించరు. కథ అలాంటిది. అందుకే ఇది షాహిద్‌ కపూర్‌ సినిమా కాదు. కబీర్‌ సింగ్‌ సినిమా. అఫ్‌కోర్స్‌ ఈ పాత్ర చాలెంజింగ్‌ అని మాత్రం ఒప్పుకుంటాను.

► ఈ రీమేక్‌ ఆలోచన మీకు వచ్చిందా?
‘అర్జున్‌రెడ్డి’ని ఒకరు చూపించారు. చాలా బాగుందనిపించింది. అయితే మనం చేసి ఇప్పుడు స్పాయిల్‌ చేయడం ఎందుకు అనుకున్నా. కానీ ఎప్పుడైతే సందీప్‌రెడ్డి హిందీ రీమేక్‌ పట్ల ఇంట్రెస్ట్‌గా ఉన్నారని తెలిసిందో అప్పుడు చేయాలనిపించింది. అతని వర్క్‌ బాగా నచ్చింది. ఓ మంచి సినిమాని ఎక్కువమంది చూడాలని కోరుకునే మనస్తత్వం నాది. ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌ నా వల్ల చూస్తారు అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది.

► ‘కబీర్‌సింగ్‌’ ట్రైలర్‌ని ప్రభాస్‌ ప్రశంసించారు..
నాకు, ప్రభాస్‌కు హకీమ్‌ హెయిర్‌ స్టైలిష్‌గా ఉన్నారు. ప్రభాస్‌ గురించి చాలా విన్నాను. సో కైండ్‌. ట్రైలర్‌ని అభినందిస్తూ ప్రభాస్‌ నాతో మాట్లాడారు. తనతో మాట్లాడటం అదే ఫస్ట్‌ టైమ్‌.

► అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌లకు పోలికలు పెడతారు. ఆ విషయం గురించి ఏమంటారు?
పోలిక పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి బాగుందంటే అది ఎప్పటికీ బాగున్నట్లే. దానికి ఆ గౌరవం ఇవ్వాలి. ‘అర్జున్‌ రెడ్డి’ బాగుంది. అలాంటప్పుడు ‘కబీర్‌సింగ్‌’తో పోలికపెట్టడం దేనికి? అర్జున్‌రెడ్డి నాకూ నచ్చింది. ఇప్పుడు ‘కబీర్‌..’ని ప్రేక్షకులు కొత్త సినిమా అనుకుని చూడాలి.  

► ‘ఉడ్తా పంజాబ్, కబీర్‌సింగ్, కమీనే’.. ఇలా డార్క్‌ రోల్స్‌ ఎక్కువగా చేస్తున్నట్లున్నారు?
 డార్క్, లైట్‌ అని కాదు భిన్నమైన పాత్రలు చేయడానికి నేను ఇష్టపడతాను. కానీ అవుటాఫ్‌ ది బాక్స్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలు చేసి ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయడంలో ఉన్న ఫీల్‌ని ఎంజాయ్‌ చేయడానికి డిఫరెంట్‌ రోల్స్‌ చేయాలనుకుంటాను.

► ‘కబీర్‌ సింగ్‌’లో రొమాంటిక్‌ సీన్స్‌ ఎక్కువ. మరి మీ ఆవిడ మీరా దగ్గర పర్మిషన్‌ తీసుకున్నారా?
నిజానికి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తనకు నచ్చింది. ఈ పాత్ర నీ కెరీర్‌కు ఫ్లస్‌ అవుతుందని తనే చెప్పింది. ఈ వృత్తిలో ఉన్న విషయాలను అర్థం చేసుకునే పరిణితి తనకు ఉంది.

► ‘కబీర్‌సింగ్‌’ లవ్‌లో ఫెయిలై, ఫైనల్లీ ప్రేమికురాలిని దక్కించుకుంటాడు. రియల్‌ లైఫ్‌లో మీకూ లవ్‌ ఫెయిల్యూర్స్‌ ఉన్నాయి కదా?
అందరి జీవితాల్లో ఉన్నట్లే నా లైఫ్‌లోనూ కొన్ని లవ్‌ ఫేజెస్‌ ఉన్నాయి. అది కామన్‌ (నవ్వుతూ).

► కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘హిందీ రీమేక్‌ ఒప్పుకోక ముందు ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూశాను. సైన్‌ చేశాక మాత్రం చూడలేదు. ఎందుకంటే ఆ ప్రభావం నా నటన మీద పడే అవకాశం ఉంది. క్యారెక్టర్‌ని నా స్టైల్‌లో నేను చేయాలనుకున్నాను. కథానుగుణంగానే ఈ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయి. ఇప్పుడు ప్రేమికులను తీసుకుందాం. వాళ్ల మధ్యమాటలతో పాటు రొమాన్స్‌ కూడా ఉంటుంది కదా. సినిమాలో షాహిద్, నేను ప్రేమికులం కాబట్టి మా మధ్య రొమాన్స్‌ ఉంటుంది. అవి లేకుండా ప్రేమ ఉండదు. షాహిద్‌ కపూర్‌ నటించిన కొన్ని సినిమాలు నేను చూశాను. అన్నింటికన్నా ‘కబీర్‌సింగ్‌’లో ‘ది బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌’ ఇచ్చాడు. ఓ 25, 30 సినిమాలు చేశాక కాలేజీ సబ్జెక్ట్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు. కొత్త హీరో అనిపించేలా చేశాడు. సందీప్‌ రెడ్డి అమేజింగ్‌ డైరెక్టర్‌ అనాలి. అసలు కథే వండర్‌ఫుల్‌ అంటే పాత్రలను ఆయన మలిచిన తీరూ అద్భుతమే.

Advertisement
Advertisement