షాహిద్‌ను కొట్టేందుకు ఆమె త‌ల్లి సాయం

17 Jul, 2020 20:03 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ న‌టి అమృతా రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసే ఉండాలి. అప్పుడెప్పుడో 'అతిథి' చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు జోడీగా న‌టించారు. ఆ త‌ర్వాత ఒక్క తెలుగు సినిమాలోనూ క‌నిపించ‌లేరు. బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోల‌తో జ‌త క‌డుతూ సినిమాలు చేసుకుంటూ పోయారు. అయితే ఈ మ‌ధ్య కాస్త వెన‌క‌బ‌డ్డ అమృతా రావు త‌న సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన‌ "ఇష్క్ విష్క్" చిత్రం నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో షాహిద్ క‌పూర్‌ను లాగి పెట్టి కొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ పూర్తి చేసేందుకు త‌ల ప్రాణం తోక్కొచ్చిందంటున్నారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు కెన్ ఘోష్.. షాహిద్‌ను కొట్టిన‌ట్లు అత‌డి మొహంలో రియాక్ష‌న్‌ క‌నిపించాల‌ని మ‌రింత ఒత్తిడి తెచ్చారు. (గురుశిష్యులు)

ప్రేక్ష‌కులు ఈ సీన్‌లో లీన‌మ‌వాల‌న్నారు. అయితే అంత‌కు ముందెన్న‌డూ ఎవ‌రినీ ఒక్క దెబ్బ కూడా వేయ‌ని అమృతా రావుకు ఈ సీన్ త‌న వ‌ల్ల కాదేమోన‌ని తెగ‌ భ‌య‌ప‌డిపోయారు. స‌రిగ్గా అప్పుడే షాహిద్ త‌ల్లి నీలిమ అజీమ్ క‌నిపించారు. ఆమే స్వ‌యంగా త‌న కొడుకును ఎలా కొట్టాలో చెప్తూ ఎంక‌రేజ్ చేశారు. షూటింగ్ ఆన్ అవ‌గానే ఆమె ప‌క్క‌నుంచి "నువ్వు చేయ‌గ‌ల‌వు, కొట్టు, గ‌ట్టిగా చెంప చెళ్లుమ‌నిపించు" అంటూ ప్రోత్స‌హించింది. వెంట‌నే అమృత కూడా షాహిద్‌ను కోపంగా ఒక్క దెబ్బ వేసింది. స్క్రీన్‌పై అది అనుకున్న‌దానిక‌న్నా బాగా రావ‌డంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. (నా సినిమాలు ఫ్లాప్‌.. అందుకే: నటుడు)

మరిన్ని వార్తలు