మళ్లీ తల్లయిన షకీరా | Sakshi
Sakshi News home page

మళ్లీ తల్లయిన షకీరా

Published Fri, Jan 30 2015 10:57 PM

మళ్లీ తల్లయిన షకీరా - Sakshi

వరల్డ్ పాపులర్ పాప్ స్టార్ షకీరా మళ్లీ తల్లి అయ్యారు. బార్సిలోనాలోని టెక్నాన్ క్లినిక్‌లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రిలో షకీరా బస కోసం ఓ అంతస్తు మొత్తాన్ని బుక్ చేశారు ఆమె భర్త గెరార్డ్ పిక్యు. ఇదిలా ఉంటే.. షకీరా మొదటి కుమారుడు ఈ నెల 22న మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఎలాగూ, ఒక కొడుకు ఉన్నాడు కదా.. ఈసారి అమ్మాయి పుడితే బాగుంటుందని షకీరా భావించారట. కానీ, కొడుకు పుట్టాడు. ‘అయినా ఫర్వాలేదు. ఆ దేవుడు నాకిచ్చిన మరో మంచి బహుమతి’ అని పేర్కొన్నారామె.

Advertisement

తప్పక చదవండి

Advertisement