వెండితెరపై మరో 'ప్రస్థానం'

1 Jan, 2017 12:25 IST|Sakshi
వెండితెరపై మరో 'ప్రస్థానం'

రెండు సినిమాలతోనే దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దేవాకట్టా. తొలి సినిమా వెన్నెలతో ఆకట్టుకున్న దేవాకట్టా తరువాత ప్రస్థానం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు కూడా దేవాకట్టా దర్వకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారు. సాయికుమార్, శర్వానంద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రస్థానం దర్శకుడితో పాటు శర్వానంద్ కెరీర్ ను కూడా మలుపు తిప్పింది.

ప్రస్థానం సినిమా తరువాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు దేవాకట్టా. నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన ఆటోనగర్ సూర్యతో పాటు, మంచు హీరోగా తెరకెక్కిన డైనమేట్ సినిమాలకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ దర్శకుడి కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో దేవాకట్టాకు బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. తన కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుడి కోసం రిస్క్ చేయడానికి రెడీ అంటున్నాడు.