శింబు : 90 | Sakshi
Sakshi News home page

శింబు : 90

Published Sat, Apr 2 2016 2:24 AM

శింబు : 90 - Sakshi

 తమిళసినిమా కొత్త పుంతలు తొక్కుతోందని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న ప్రయోగాలతో జాతీయ అవార్డులను కొల్లగొట్టే స్థాయికి చేరి చాలా కాలమైంది. కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్న కోలీవుడ్‌లో ఇప్పటి వరకూ మాస్ ఇమేజ్‌పై దృష్టి సారించిన సంచలన నటుడు శింబు తాజాగా వైవిధ్య భరిత పాత్రలో నటించడం విశేషం. అవును నటుడు శింబు నటిస్తున్న నూతన చిత్రంలో మూడు వైవిధ్యభరిత గెటప్‌లలో కనిపించనున్నారు.
 
 త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంతో దర్శకుడుగా పరిచయమై దాన్ని కమర్షియల్‌గా హిట్ చేసి నిర్మాతకు కాసుల వర్షం కురిపంచిన ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభంమైంది. ఇందులో శింబు మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. అందులో ఒక  గెటప్ కోసం శింబు తన బరువును 90 కేజీలకు పెంచనున్నారట.
 
 అందుకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి అయిన తరువాత మళ్లీ సాధారణ బరువుకు తగ్గి నటించనున్నారని తెలిసింది. ఇప్పుడాయన తన బరువును పెంచే చర్యలకు ఉపక్రమించారని సమాచారం. శింబు నటించిన ఇదునమ్మఆళు చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించిన అచ్చంయంబదు మడమయడా చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నాయన్నది గమనార్హం. తదుపరి శింబు వాలు చిత్ర దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించనున్నారు.
 

Advertisement
Advertisement