Sakshi News home page

మహానటుడు శివాజి

Published Sat, Mar 21 2015 3:33 AM

మహానటుడు శివాజి

ఒక శరీరంతో వందమందిలా జీవించిన మహానటుడు శివాజి గణేశన్ అని సీనియర్ నటుడు శివకుమార్ వ్యాఖ్యానించారు. దివంగత నటుడు శివాజీ గణేశన్ నటించిన వీరపాండియ కట్టబొమ్మన్ ఆయన సినీ కెరీర్‌లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. వీరపాండియ కట్టబొమ్మన్‌గా శివాజి నటనను వర్ణించడానికి మాటలు చాలవు. శివాజి నవరసాలు పండించిన చిత్రాలలో వీరపాండియ కట్టబొమ్మన్ తొలి వరుసలో ఉంటుంది.

జెమినీ గణేశన్, పద్మిని వంటి పలువురు ప్రఖ్యాత కళాకారులు నటించిన ఈ చిత్రానికి దర్శక దిగ్గజం బీఆర్ పంతులు సృష్టికర్త. పద్మిని పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1959లో విడుదలైన చరిత్ర సృష్టించింది. అలాంటి చిత్రం 56 ఏళ్ల తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త సొబగులు సంతరించుకుని మళ్లీ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

సాయి గణేశ్ ఫిలింస్ అధినేతలు శ్రీనివాసన్, మురళి పునర్ విడుదల కార్యక్రమంలో చేపట్టిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. శివకుమార్ ట్రైలర్‌ను ఆవిష్కరించి తొలి ప్రతిని నటుడు ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్ ప్రభు, రచయిత వైరముత్తులకు అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement