‘గోపాల గోపాల’లో కొత్త శ్రీయ | Sakshi
Sakshi News home page

‘గోపాల గోపాల’లో కొత్త శ్రీయ

Published Tue, Jun 17 2014 10:53 PM

‘గోపాల గోపాల’లో కొత్త శ్రీయ

శ్రీయ తన కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషించారు. పరిపూర్ణ వ్యక్తిత్వం గల స్త్రీగా ఆమె నటించింది లేదు. తొలిసారిగా ‘మనం’లో అలా కనిపించింది. ఇంకేముంది ఎక్కడ లేని ప్రశంసలు. లేటెస్ట్ లేడీ సూపర్‌స్టార్ సమంతకు దీటుగా మార్కుల్ని కొట్టేశారు శ్రీయ. పైగా ‘మనం’లో సమంత పాత్రతో పోలిస్తే శ్రీయ పాత్ర నిడివి చాలా తక్కువ. ఏది ఏమైనా ‘మనం’ ఆమెకు మంచి మలుపు అయ్యింది. ఇప్పుడు ‘గోపాల గోపాల’ లాంటి ప్రతిష్ఠాత్మకమైన చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యిందంటే.. అదంతా ‘మనం’ పుణ్యమే. విశేషమేంటంటే- ‘గోపాల గోపాల’లో కూడా శ్రీయ పాత్ర సామాన్యమైనది కాదట.
 
 నిజమైన స్త్రీ మూర్తికి నిర్వచనంగా ఆ పాత్ర ఉంటుందట. పైగా వెంకటేశ్ పాత్రకు దీటుగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. నిజానికి మాతృక ‘ఓ మైగాడ్’లో కథానాయిక పాత్ర లేదు. కేవలం తెలుగు సినిమా కోసమే ఈ పాత్రను దర్శకుడు డాలీ డిజైన్ చేశారట. ఈ పాత్ర గురించి ఇటీవల శ్రీయ మాట్లాడుతూ- ‘‘నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఇంత గొప్పగా మొదలవుతుందని అనుకోలేదు. ఈ విషయంలో ‘మనం’ సినిమాకు థ్యాంక్స్. ఇప్పుడు చేస్తున్న ‘గోపాల గోపాల’లో కూడా నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఒక కొత్త శ్రీయను చూస్తారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఈ పాత్ర నాకు ఓ ఊతంగా ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement