ముంబయ్‌లో సొంత గూడు

6 Jun, 2014 02:08 IST|Sakshi
ముంబయ్‌లో సొంత గూడు

 హీరోయిన్లు చాలా తెలివైన వారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అసలు విషయానికొస్తే నేటి క్రేజీ కథానాయికల్లో ఒకరిగా ప్రకాశిస్తున్న శ్రుతి హాసన్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దూసుకుపోతున్నారు. అదే విధంగా విజయాలతో యమా జోరుగా ఉన్న ఈ బ్యూటీ చెన్నై, హైదరాబాద్, ముంబాయి అంటూ షూటింగ్‌ల కోసం ఎక్కువ సమయాన్ని విమానంలోనే గడిపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమెకంటూ ఈ మూడు ప్రాంతాల్లో సొంత నివాసం లేదు.
 
 తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబాయిలో ఒక సొంత గూడును ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలో అద్దె ఇంటిలో ఉంటున్న శ్రుతి హాసన్ తాజాగా ముంబాయిలోని అందేరి ప్రాంతంలో సొంతంగా ఒక బంగ్లాను కొనుగోలు చేశారు. రెండు బెడ్‌రూమ్‌లతో కూడిన ఈ బంగ్లాను ప్రస్తుతం తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ వర్క్‌ను చేయిం చుకుంటున్న శ్రుతి హాసన్ త్వరలోనే అక్కడికి మకాం మా ర్చనున్నారని సమాచారం.