సిద్ధార్థ్‌ 'జిల్‌ జంగ్‌ జక్‌' | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్‌ 'జిల్‌ జంగ్‌ జక్‌'

Published Sun, Nov 1 2015 8:53 AM

Siddharth's second film as producer is 'jill jung juck'

సిద్ధార్థ్‌ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'జిల్‌ జంగ్‌ జక్‌' ఫస్ట్‌లుక్‌ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ధీరజ్‌ వైడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వయంగా సిద్ధార్థే నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా 'జిల్‌ జంగ్‌ జక్‌' ఫస్ట్ లుక్కు రితేష్ దేశ్ముఖ్, హన్సిక లాంటి స్టార్ల నుంచే కాక పలువురి  నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్థ్‌ హీరోగా తమిళంలో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని తెలుగులో 'దిల్ రాజు' టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే కాస్కో అనే సబ్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

సిద్ధార్థ్‌ హీరోగా పిజ్జా దర్శకుడు తమిళంలో రూపొందించి హిట్టైన 'జిగర్‌తండా' చిత్రానికి తెలుగు టైటిల్ గా 'చిక్కడు దొరకడు' ని ఖరారు చేస్తూ ఆ మధ్యన పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడేవారే కరువయ్యారు. మళ్లీ ఇప్పుడు దాన్ని టైటిల్ మార్చి... 'దిల్ రాజు' అని పెట్టారు.  'దిల్ రాజు' అనే టైటిల్ పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది.

 

Advertisement
Advertisement