కారు సడన్‌గా ఆగింది! | Sakshi
Sakshi News home page

కారు సడన్‌గా ఆగింది!

Published Sun, Mar 31 2019 5:56 AM

Siddhi Idnani interview (Telugu) about Prema Katha Chitram 2 - Sakshi

‘‘ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్‌ చాలా ముఖ్యమని భావిస్తాను. పాత్రల మధ్య వైవిధ్యం చూపేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్‌ సిద్ధీ ఇద్నాని అన్నారు. సుమంత్‌ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధీ ఇద్నానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్‌ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. హరి కిషన్‌ దర్శకత్వం వహించారు. ఆర్‌. సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధీ ఇద్నాని చెప్పిన విశేషాలు.

► ఈ చిత్రంలో నా నిజజీవితానికి దగ్గరగా ఉండే బిందు అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. బిందుకి చాలా గర్వం. తను ఇష్టపడితే అవతలివారు ఇష్టపడాల్సిందే. ఈ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్‌ అశ్విన్‌ మంచి కో–స్టార్‌. అతనికి ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నప్పటికీ నిగర్వంగా ఉంటాడు. సెట్‌లో ఫుడ్‌ గురించి, ట్రావెల్‌ గురించి మేం ఎక్కువగా మాట్లాడుకున్నాం. నందితాశ్వేతాతో నాకు మూడు, నాలుగు సీన్స్‌ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె నటించిన హారర్‌ సినిమాలు చూశాను. దర్శకుడు హరి సెట్‌లో సీన్స్‌ను బాగా వివరించడంతో ఈజీ అయింది. ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ చాలా పెద్ద విజయం సాధించింది. రెండో పార్ట్‌ పై అంచనాలు ఉంటాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో దెయ్యం ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

► కోపం, సంతోషం వంటి ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగానే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి రెగ్యులర్‌ లైఫ్‌లో భాగమే. కానీ పొసెస్డ్‌గా.. అంటే నాకే సొంతం అన్న ఫీలింగ్‌ను ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి కాస్త హోమ్‌వర్క్‌ చేశాను.

► అతీంద్రియ శక్తులను నమ్ముతాను. ఆత్మలు ఉన్నాయని నా నమ్మకం. ఓ సారి నేను కారులో వెళ్తుంటే సడన్‌గా ఆగింది. రెడ్‌ శారీలో ఓ లేడీ వచ్చి కారు ముందు నిలబడింది. ఈ అనుభవంతో భవిష్యత్‌లో నేను కచ్చితంగా సినిమా చేస్తాను.

► నేను తెలుగులో హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ‘జంబలకిడిపంబ’(2018) ట్రైలర్‌ రిలీజైనప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ట్రైలర్‌లో నేను అబ్బాయిలా నటించడం చూసి నిర్మాత పిలిచి,  ఆడిషన్‌ ఇవ్వమని అడగలేదు. ఇది కథ, నీ క్యారెక్టర్‌ ఇలా ఉంటుందని చెప్పారు. ‘జంబలకిడిపంబ’ చిత్రం మంచి హిట్‌ సాధించి ఉంటే నాకు మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి.

► సమంతకు నేను అభిమానిని. ఆమె ఎంపిక చేసుకుంటున్న తరహా పాత్రలు చేయాలని ఉంది. రాజమౌళిగారి దర్శకత్వంలో నటించాలని ఆశ. ప్రస్తుతం నేను నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌ యాభై శాతం పూర్తయింది. జూన్‌లో విడుదల కావొచ్చు. మరో సినిమా కమిట్‌ అయ్యాను. ఈ నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్తుంది.

Advertisement
Advertisement